Breaking News

శర్వా వరస సినిమాలు.. కానీ హిట్‌ కొట్టెదెప్పుడు?

Published on Mon, 10/27/2025 - 18:49

ఒకప్పుడు అంటే ఎలాంటి కమర్షియల్ సినిమాలు తీసినా సరే ఎలాగోలా హీరోల బండి నడిచేది. కానీ గత కొన్నాళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల్ని చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి దారుణంగా తయారైంది. దానికి తోడు పలువురు హీరోల మూవీస్ కూడా పెద్దగా వర్కౌట్ కావట్లేదు. అలాంటి వాళ్లలో శర్వానంద్ ఒకడు. ఇంతకీ ప్రస్తుతం ఈ హీరో ఏం చేస్తున్నాడు? కొత్త మూవీస్ సంగతేంటి?

గమ్యం, ప్రస్థానం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. సోలో హీరోగా నిలదొక్కుకోవడానికి బాగానే కష్టపడ్డాడు. కానీ అదృష్టం త్వరగా కలిసి రాలేదు. మంచి నటుడే అని ప్రూవ్ చేసుకున్నప్పటికీ 2014లో 'రన్ రాజా రన్' హిట్ కొట్టి ట్రాక్‌లోకి వచ్చాడు. అలా 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత చేసిన రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం.. ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. చివరగా 2022లో 'ఒకే ఒక జీవితం' చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

యంగ్ హీరోలు అంటే ఎలా ఉండాలి? పెద్ద హీరోల్లా కాకుండా ఏడాది కనీసం ఒకటి రెండు సినిమాలైనా చేస్తూ ప్రేక్షకుల దృష్టిలో ఉండాలి. లేదంటే ఆడియెన్స్ వీళ్లని మర్చిపోయే అవకాశముంది. అలాంటి శర్వానంద్ నుంచి గత మూడేళ్లలో ఒక్కటే సినిమా వచ్చింది. అది గతేడాది రిలీజైన 'మనమే'. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ ఏడాది ఏవైనా కొత్త చిత్రాలు తీసుకొస్తాడా అని చూస్తే ప్రస్తుతానికైతే ఆ సూచనలు కనిపించట్లేదు.

2026లో శర్వానంద్ నుంచి ఏకంగా మూడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం సంక్రాంతిని టార్గెట్ చేశారు. కొన్ని రోజుల క్రితమే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ పండకు చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల మూవీస్ ఉన్నాయి. మరి వాళ్లతో పోటీపడి శర్వా బరిలోకి దిగుతాడా అనేది చూడాలి? మరోవైపు బైకర్ అనే స్పోర్ట్స్ డ్రామా మూవీ, భోగీ అనే యాక్షన్ మూవీ కూడా ఈ హీరో చేస్తున్నాడు. వీటితో హిట్ కొట్టి కమ్ బ్యాక్ అయితే సరేసరి. లేదంటే మాత్రం ప్రస్తుత జనరేషన్‌లో వెనకబడిపోయే ప్రమాదముంది? మరి 2026 అయినా శర్వాకు కలిసొస్తుందేమో చూడాలి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)