Breaking News

'నారీ నారీ నడుమ మురారి' ఓటీటీ డేట్‌ వచ్చేసింది

Published on Fri, 01/30/2026 - 14:16

ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీపడి మరీ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న చిత్రం "నారీ నారీ నడుమ మురారి". శర్వానంద్‌ హీరోగా సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మించాడు. జనవరి 14న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

వచ్చే వారం ఓటీటీలో..
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఫిబ్రవరి 4 నుంచి ప్రసారం కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ప్రైమ్‌ వీడియో అధికారిక పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. మరి థియేటర్లలో సినిమా చూడటం మిస్‌ అయినవారు ఎంచక్కా వచ్చే వారం నారీ నారీ నడుమ మురారి చూసేయండి..

శర్వా అలా అన్నాడో లేదో..
నారీ నారీ నడుమ మురారి టీమ్‌.. జనవరి 23న సంక్రాంతి విన్నర్‌ బ్లాక్‌బస్టర్‌ ఈవెంట్‌ అంటూ సెలబ్రేషన్స్‌ జరిపారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్‌ మాట్లాడుతూ.. ఈ మూవీ ఇక్కడితో ఆగిపోదు, ఇంకో నాలుగువారాలు ఆడుతుందన్నాడు. థియేటర్ల సంఖ్య కూడా పెంచామని తెలిపాడు. శర్వానంద్‌ అలా అన్నాడో లేడో రెండు వారాల్లోనే మూవీ ఓటీటీలో రిలీజ్‌ అవుతుండటం గమనార్హం. ఒక్కసారి సినిమా ఓటీటీకి వచ్చాక థియేటర్లలో ఆడటం కష్టమే!
 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)