Breaking News

ఓటీటీలో హీరామండి.. స్టార్‌ డైరెక్టర్‌ మేనకోడలిపై విమర్శలు!

Published on Sun, 05/05/2024 - 13:10

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. మే 1 స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌కు ఆడియన్స్‌ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సిరీస్‌ ఏకంగా ఆరుగురు హీరోయిన్స్‌ నటించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ నటించారు. అయితే ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా కూతురిగా మెప్పించిన షర్మిన్ సెగల్‌పై పాత్రపై విమర్శలొచ్చాయి. హీరామండిలో అలంజేబ్‌ పాత్రపై చాలామంది ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేశారు.

చాలా మంది ప్రేక్షకులు హీరామండిలోని నటనను ప్రశంసించగా, ఈ సిరీస్‌లో కొయిరాలా పాత్ర మల్లికా జాన్ కుమార్తె అలంజేబ్ పాత్రను పోషించిన షర్మిన్, ముఖ్యంగా ఆమె నటనకు విమర్శలను అందుకుంది. తన పాత్రలో ప్రతి సీన్‌లో ఓకే ఎక్స్‌ప్రెషన్‌తో కనిపించడంతో కొందరు ఆమెపై కామెంట్స్ చేశారు. దీంతో తాజాగా తన ఇన్‌స్టా పోస్ట్‌కు కామెంట్ సెక్షన్‌ను నిలిపేసింది బాలీవుడ్ భామ. ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేయడం సంజయ్‌ చేసిన బిగ్ మిస్టేక్‌ అంటూ కొందరు కామెంట్స్‌ చేశారు. 

అలంజేబ్ పాత్రలో నటించిన షర్మిన్ సెగల్ స్వయాన సంజయ్ లీలా బన్సాలీకి మేనకోడలు కావడం విశేషం. ఆమె సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత మలాల్ చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది. అంతే కాకుండా గోలియాన్‌కి రాస్లీలా రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కతియావాడి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఆ తర్వాత హారర్ కామెడీ 'అతిథి భూతో భవ  సినిమాలో నటించింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)