Breaking News

దీపిక అడిగింది ఇవ్వాల్సిందే!: అర్జున్‌ రెడ్డి బ్యూటీ

Published on Mon, 10/13/2025 - 13:09

మిగతా ఇండస్ట్రీల మాదిరిగా సినీ పరిశ్రమ ఓ పద్ధతి ప్రకారం లేదు. ఇక్కడ పనిగంటలు కరెక్ట్‌గా ఉండవు. అన్నిచోట్లా ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఎనిమిది గంటలు పనిచేసే విధానాన్ని అనుసరించాలని బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone) కొంతకాలంగా డిమాండ్‌ చేస్తోంది. చిన్న, మధ్యతరహా సినిమాలకు ఈ డిమాండ్లు సెట్‌ అవుతాయేమో కానీ భారీ బడ్జెట్‌ చిత్రాలకు వీటిని ఫాలో అవడం కష్టం!

దీపికా.. నాకు చాలా ఇష్టం
ఈ కారణం వల్లే స్పిరిట్‌, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు దీపిక చేజారిపోయాయి. దీపిక డిమాండ్‌ గురించి తాజాగా అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌ షాలిని పాండే (Shalini Pandey) స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నాకు దీపికా పదుకొణె అంటే చాలా ఇష్టం. స్కూల్‌లో చదువుకునే రోజుల నుంచి తనను చూస్తున్నాను. ఆమె జర్నీని ఫాలో అయ్యాను. తనొక గొప్ప యాక్టర్‌. తనకు ఏది అవసరమో దాని గురించి నిర్భయంగా మాట్లాడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని నొక్కి చెప్పింది. తనవల్లే మేమందరం మానసిక ఆరోగ్యం గురించి ఓపెన్‌గా మాట్లాడగలుగుతున్నాం. 

సినిమా
తను కోరుకున్నది తనకు దక్కాల్సిందేనని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చింది. అటు కొంకణ సేన్‌ శర్మ మాట్లాడుతూ.. మేమేం సర్జరీ చేసే డాక్టర్స్‌ కాదు కదా.. మేమూ మనుషులమే! మాకూ చిన్నపాటి బ్రేక్స్‌ కావాలి అని పేర్కొంది. షాలిని పాండే తొలి చిత్రం అర్జున్‌ రెడ్డితో బాగా పాపులర్‌ అయింది. తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. డబ్బా కార్టెల్‌ అనే వెబ్‌ సిరీస్‌లోనూ తళుక్కుమని మెరిసింది. ధనుష్‌ ఇడ్లీ కొట్టు మూవీలో కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ అక్టోబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తోంది.

చదవండి: ఏయ్‌, ఎందుకు అరుస్తున్నావ్‌? ఫస్ట్‌రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు