Breaking News

నయనతారను పొగిడిన షారుక్‌ ఖాన్‌

Published on Mon, 02/06/2023 - 08:44

బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ తాజాగా నటించిన చిత్రం పఠాన్‌. ఇటీవల విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. కొద్దికాలంగా సక్సెస్‌ లేక కళ తప్పిన బాలీవుడ్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కాగా ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న జవాన్‌ చిత్రంపై పఠాన్‌ ప్రభావం బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో షారుక్‌ ఖాన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కోలీవుడ్‌ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించడం, సంచలన నటి నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. దర్శకుడు అట్లీతో పాటు నయనతారకి బాలీవుడ్‌ ఎంట్రీ చిత్రం ఇదే. జవాన్‌ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

షారుక్‌ ఖాన్‌ ఇటీవల ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నయనతార గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు షారుక్‌ ఖాన్‌ బదిలిస్తూ ఆమె సో స్వీట్‌ అని పేర్కొన్నారు. ఆమెకు అనేక భాషలు తెలుసని జవాన్‌ చిత్రంలో నయనతారతో కలిసి నటించడం మంచి అనుభవమని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఆమె నటన అందరికీ నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రంలో నటుడు విజయ్‌ సేతుపతి, నటి ప్రియమణి, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించడం విశేషం. ఇకపోతే జవాన్‌ నయనతార, దర్శకుడు అట్లిల బాలీవుడ్‌ భవిష్యత్‌ను నిర్ణయించే చిత్రం అవుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. నయనతార ప్రస్తుతం తమిళంలో మరో రెండు కొత్త చిత్రాలు నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

చదవండి: చిన్నారి పెళ్లికూతురు నటి సీమంతం

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)