Breaking News

బిగ్‌ డీల్‌ ప్లాన్‌తో సుకుమార్‌.. విలన్‌గా షారుక్‌ఖాన్‌

Published on Tue, 03/18/2025 - 07:28

అల్లు అర్జున్‌(Allu Arjun), సుకుమార్‌ (Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదుచేసింది. ఈ మూవీ తర్వాత సుకుమార్‌కు బాలీవుడ్‌లో క్రేజ్‌ పెరిగింది. దీంతో ఆయన తర్వాత డైరెక్ట్‌ చేయబోయే సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో సుకుమార్‌ గురించి బాలీవుడ్‌ నుంచి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్‌ అవుతుంది.  

పుష్ప2 విజయం తర్వాత రామ్‌చరణ్‌తో (Ram Charan) చేయనున్న సినిమా కోసం స్క్రిప్ట్‌ పనిలో సుకుమార్‌ బిజీగా ఉన్నారనే విషయం తెలిసిందే.. అయితే, సుకుమార్‌- షారుక్‌ఖాన్‌(Shah Rukh Khan) కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతుందని బాలీవుడ్‌ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఈమేరకు షారుక్‌ టీమ్‌తో చర్చలు కూడా జరిగిపోయాయని తెలుస్తోంది. రాజకీయం నేపథ్యం ఉన్న ఒక గ్రామీణ కథను షారుక్‌ఖాన్‌కు సుక్కు వినిపించారట.. అది ఆయనకు కూడా బాగా నచ్చేసిందని టాక్‌. కానీ, ఈ కథలో షారుక్‌ వ్యతిరేక (విలన్‌)  పాత్రలో కనిపిస్తారని బాలీవుడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి.

'పుష్ప 1, 2'లకు సీక్వెల్‌గా పార్ట్‌ -3 ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆపై చరణ్‌ ప్రాజెక్ట్‌ కూడా సుకుమార్‌ చేతిలో ఉంది. మరి షారుక్‌ఖాన్‌ కూడా రీసెంట్‌గా తన సొంత బ్యానర్‌ నుంచి ఒక సినిమాను ప్రకటించారు. ఇలా ఇద్దరూ ఫుల్‌ బిజీగా తమ వర్క్‌లో ఉన్నారు. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్‌లో  సినిమా ఎప్పుడు సెట్‌ అవుతుందని ఫ్యాన్స్‌ ఆలోచిస్తున్నారు. అయితే, వారిద్దరి నుంచి కూడా ఈ వార్త గురించి ఎలాంటి రియాక్షన్‌ రాలేదు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)