Breaking News

టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్‌ నటి జమున కన్నుమూత

Published on Fri, 01/27/2023 - 08:55

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్‌ నటి జమున(86)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌ చాంబర్‌కు జమున భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. 1936 ఆగస్టు 30న హంపీలో జన్మించిన జమున 1953లో 'పుట్టిల్లు' అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో నటించారు.

ఆమె పోషించిన సత్యభామ పాత్ర జమునకు మంచి పేరు తీసుకువచ్చింది. 'సినిమా సత్యభామ'గా జమునకు పేరుంది. మిస్సమ్మ సినిమా జమున కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. అలనాటి అగ్రనటులు అందరితోనూ నటించారామె.

గుండమ్మ కథ, మిస్సమ్మ ఇల్లరికం, ఇలవేల్పు, లేత మనసులు సహా సుమారు 200కు పైగా సినిమాల్లో నటించారు. 1964, 1968లో ఉత్తమ సహాయ నటిగా జమునకు ఫిల్మ్‌ ఫేర్‌అవార్డులు అందుకున్న జమునకు 2008లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం దక్కింది. వైవిధ్యమైన పాత్రలతో అలరించిన జమున మృతి టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఇక పొలిటికల్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. 1989లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్‌ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కొంతకాలానికే ఆమె రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)