Breaking News

నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్ కమ్ముల

Published on Thu, 06/19/2025 - 09:15

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల( Sekhar Kammula) తెరకెక్కించిన చిత్రం 'కుబేర'. జూన్‌ 20న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆయన పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో సుమారు నాలుగేళ్ల క్రితం శేఖర్ కమ్ముల చేసిన సాయం గురించి యాంకర్‌ ప్రశ్నించారు.  ఒక రైతు కుటుంబానికి రూ. 2 లక్షలు  సాయం ఎందుకు శారో చెప్పాలని కోరారు. దీంతో శేఖర్‌ కమ్ముల పలు విషయాలను పంచుకున్నారు.

కూతురు పెళ్లి చేద్దామని  ఓ రైతు దాచుకున్న డబ్బు అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. దీంతో ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డాడని వార్త తెలిసింది. అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి.  కూతురి పెళ్లి కోసం కష్టపడి దాచుకున్న డబ్బు అలా కాలిపోవడంతో నేను బాగా ఎమోషనల్‌ అయ్యాను. బాగా డబ్బున్నోడి నోట్ల కట్టలు మంటల్లో కాలిపోతేనే బాధేస్తుంది..అలాంటిది పేదోడి డబ్బు, అది కూడా ఎంతో కష్టపడి సంపాధించింటాడు. దీంతో  ఆ రైతు బాధేంటో నాకు అర్థం అయింది. అందుకే సాయం చేశాను.' అని ఆయన చెప్పారు.  కోవిడ్‌ సమయంలో  ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సాయం చేశారు. ఆయన ప్రొడక్షన్‌ హౌస్‌ అమిగోస్‌ నుంచి పలు సేవలు అందించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారికి ప్రతిరోజు ఆయన భోజనం అందించారు. అయితే, ఇవన్నీ ఆయన ఎక్కడా కూడా చెప్పుకోలేదు.

2021 సమయంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రికి చెందిన  కప్పల లక్ష్మయ్య అనే రైతు పూరిల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో తన కూతురు పెళ్లి కోసం  బీరువాలో దాచుకున్న రూ.  లక్షలు మంటల్లో కాలిపోయాయి. ఆ వార్త తెలుసుకున్న శేఖర్ కమ్ముల.. ఆ రైతు కుటుంబానికి రూ. 2లక్షలు  నేరుగా రైతు బ్యాంక్ ఖాతాకు  పంపించారు. అదే సమయంలో రైతు కుటుంబంతో మాట్లాడిన ఆయన అవసరమైతే మరింత సాయం చేస్తానని.. ముందు కూతురు పెళ్లి మంచిగా జరిపించాలని కోరారు.
 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)