Breaking News

రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. 'స్కామ్ 2010' వచ్చేస్తుంది

Published on Fri, 05/17/2024 - 08:02

ప్రపంచాన్ని కుదిపేసిన స్కామ్‌ల  గురించి ఇప్పటికే  రెండు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.  హన్సల్‌ మెహతా నిర్మించిన ఈ సిరీస్‌లను తుషార్‌ దర్శకత్వం వహించారు. భారత స్టాక్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన హర్షద్‌ మెహతా కథ ఆధారంగా వచ్చిన వెబ్‌సిరీస్‌ 'స్కామ్‌ 1992'. ఎలాంటి అంచనాలు లేకుండా 2020లో సోనీ లివ్‌లో విడుదలైంది. కానీ, ఈ వెబ్‌ సిరీస్‌కు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. అదే తరహాలో  'స్కామ్‌ 2003' తెరకెక్కింది. 2003లో స్టాంప్‌ పేపర్‌ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ కథను తెర మీద చూపించారు.  ఈ రెండింటికీ సోనీ లివ్‌ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా 'సుబ్రతా రాయ్ సహారా' స్కామ్ గురించి హన్సల్ మెహతా మరో సిరీస్‌ను తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ వెబ్‌ సిరీస్‌కు 'స్కామ్ 2010 ది సుబ్రతా రాయ్ సాగా' అని హన్సల్ వెల్లడించారు. తమల్ బందోపాధ్యాయ రాసిన సహారా: ది అన్‌టోల్డ్ స్టోరీ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.

కేవలం రూ. 2000తో వ్యాపారం మొదలుపెట్టిన సుబ్రతా రాయ్.. రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులతో భారీ కార్పొరేట్‌ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే, ఆయనపై చిట్ ఫండ్ అవకతవకలు, నకిలీ ఇన్వెస్టర్ల ఆరోపణలో రావడంతో 2014లో ఆయనను అరెస్ట్ చేశారు. తీహార్‌ జైలులో కొంతకాలం శిక్ష అనుభవించారు. ఆయన తల్లి మరణంతో  అంత్యక్రియల కోసం 2016లో బయటకు వచ్చారు. అప్పటి నుంచీ పెరోల్‌పై బయటే ఉన్నారు. ఈ క్రమంలో గతేడాదిలో సుబ్రతా రాయ్‌  గుండెపోటుతో మరణించారు. సహారా స్కామ్‌లో దాగివున్న నిజాలను ఈ సిరీస్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. సోనీ లివ్‌ ఓటీటీలో విడుదల కానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)