Breaking News

'బిగ్‌బాస్‌' సంజనాకు సుప్రీం కోర్ట్‌ నోటీసులు

Published on Sat, 09/27/2025 - 11:25

డ్రగ్స్‌ కేసులో సినీ నటి సంజన గల్రానీకి సుప్రీం కోర్ట్‌ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. 2020లో కన్నడ పరిశ్రమను ఈ డ్రగ్స్‌ కేసు కుదిపేసింది. ఆ సమయంలో సినీ నటి రాగిణి ద్వివేదితో పాటు సినీ నటి సంజనా గల్రానీని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, ఈ కేసులో 14వ నిందితురాలిగా  సంజనాను చేర్చారు. సుమారు రెండు నెలల తర్వాత బెయిల్‌ దొరకడంతో జైలు నుంచి విడుదలయ్యారు.

సంజన గల్రానీపై కొకైన్‌, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ వంటి మత్తు పదార్థాల వినియోగించడంతో పాటు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, 2024 మార్చి 25న, కర్ణాటక హైకోర్టు ఈ కేసును సాంకేతిక కారణాలతో రద్దు చేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం, Section 219 CrPC ప్రకారం 12 నెలల వ్యవధిలో మూడు కంటే ఎక్కువ నేరాలపై ఒకే ట్రయల​్‌లో జరపలేమని పేర్కొంది. దీంతో ఆమెకు ఉపశమనం లభించింది. అయితే, తాజాగా  కర్ణాటక ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు సంజనా గల్రానీకి నోటీసు జారీ చేసింది. ఈ కేసు గురించి వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది.

సంజన గల్రానీ మత్తు పదార్థాలు వినియోగించడమే కాకుండా నైజీరియన్స్‌ నుంచి కొనుగోలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం తరపున వాదించే లాయర్‌ పేర్కొన్నారు.. ఆర్థిక లాభాల కోసం పార్టీల సమయంలో ఆమె వాటిని వివిధ వ్యక్తులకు విక్రయించిందని, అందుకు సంబంధించిన ఆధారాలను సుప్రీం కోర్టుకు అందించారు.  సినీ, రాజకీయాలతో సంబంధం ఉన్న చాలామంది  డ్రగ్స్‌ వాడినట్టు  సమాచారం ఉంది. విచారణలో వారి పేర్లు చెప్పాలని సంజనాను గతంలోనే బెంగళూరు పోలీసులు కోరారు. కానీ, ఆమె ఆ వివరాలు చెప్పలేదని సమచారం. ఇప్పుడు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడంతో మరిన్ని వివరాలు మళ్లీ తెరపైకి రానున్నాయి.

బిగ్‌బాస్‌9లో సంజన
బిగ్‌బాస్‌9 తెలుగు సీజన్‌లో సంజన గల్రానీ సత్తా చాటుతున్నారు.  ఈ సీజన్‌కు హైప్‌ క్రియేట్‌ చేసిన కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందారు. అయితే, ఎలిమినేషన్‌​ పేరుతో ఆమెను సీక్రెట్‌ రూమ్‌కు బిగ్‌బాస్‌ పంపారు. ప్రస్థుతం స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా ఆమె రాణిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)