Breaking News

తండేల్ సినిమాను తలపించేలా తెలుగు వెబ్ సిరీస్‌.. ట్రైలర్ చూశారా?

Published on Fri, 08/01/2025 - 17:02

తాజాగా కింగ్‌డమ్‌ మూవీతో అలరించిన సత్యదేవ్‌ మరో ఆసక్తికర కంటెంట్‌తో అభిమానుల ముందుకొస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వెబ్ సిరీస్‌ అరేబియా కడలి. ఈ వెబ్ సిరీస్‌కు వీవీ సూర్యకుమార్ ‍దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్‌ రూపొందిస్తోన్న ఈ సిరీస్‌ ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేపథ్యంలోనే అరేబియా కడలి ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే నాగ చైతన్య నటించిన తండేల్‌ సినిమాను తలపించేలా కనిపిస్తోంది. మత్స్యకారుల బ్యాక్‌ డ్రాప్‌లోనే ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను పాకిస్తాన్‌కు బందీలుగా దొరికిపోవడం.. ఆ తర్వాత జరిగే పరిణామాలతో ఆసక్తి పెంచుతోంది. సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సిరీస్‌లో చూపించనున్నారు. ఈ సిరీస్‌లో ఆనంది, నాజర్, రఘు బాబు కీలక పాత్రలు పోషించారు.

ఇది కేవలం బ్రతకడం గురించి కాదు. మనుషులు కష్టాల్లో ఎలా ఒకరికొకరు అండగా నిలబడతారో చూపిస్తుందని దర్శకుడు సూర్య కుమార్ అన్నారు. సత్యదేవ్ కూడా తన కెరీర్లోనే ఇదొక ఛాలెంజింగ్ రోల్ అని పేర్కొన్నారు. నా కెరీర్‌లో అత్యంత సంతృప్తినిచ్చిన ప్రయాణాలలో ఒకటని సత్యదేవ్ అన్నారు. కష్టాలు, త్యాగాల మధ్య చిక్కుకున్న ఒక పాత్రను పోషించడం చాలా సవాల్‌తో కూడుకున్నదని చెప్పారు. ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయని,.. అన్యాయంపై పోరాడే మహిళగా నటించడం సంతృప్తినిచ్చిందని హీరోయిన్ ఆనంది తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)