Breaking News

మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా.. ఈ హీరోని గుర్తుపట్టారా?

Published on Tue, 08/12/2025 - 12:30

ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న మహేశ్ బాబు.. ఆ బిజీలో ఉన్నాడు. మరోవైపు నిర్మాతగా కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మేరకు డీటైల్స్ బయటపెట్టారు. 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేశ్ మహా చాన్నాళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం చేస్తున్నాడు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? హీరో ఎవరు?

(ఇదీ చదవండి: మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవి.. ఏంటి విషయం?)

టాలీవుడ్‌లో హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్.. ఇటీవలే 'కింగ్డమ్'లోనూ హీరోకి సరిసమానంగా ఉండే నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు వెంకటేశ్ మహా దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నాడు. దీనికి 'రావు బహదూర్' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా వదిలారు.

సత్యదేవ్.. 'రావు బహదూర్' ఫస్ట్ లుక్ పోస్టర్‌లో డిఫరెంట్‌గా కనిపించాడు. చెప్పాలంటే గుర్తుపట్టడం చాలా కష్టం. ముసలి రాజు గెటప్‌లో అస్సలు గుర్తుపట్టలేనట్లు ఉన్నాడు. 'అనుమానం పెనుభూతం' అనే ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ తీస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించేశారు. గతంలో సత్యదేవ్-వెంకటేశ్ మహా 'ఉమామహేశ్‌వర ఉగ్రరూపశ్య' అనే మూవీ చేశారు. కాకపోతే అది రీమేక్. ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్‌తో వస్తున్నారు. ఈసారి ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి?

(ఇదీ చదవండి: ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు: అనుపమ)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)