Breaking News

రాజమౌళి కంటే ధనుష్‌తోనే కష్టం: 'కట్టప్ప' సత్యరాజ్

Published on Sun, 09/21/2025 - 16:38

తమిళ నటుడు సత్యరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 'బాహుబలి' కట్టప్పగా చాలా ఫేమస్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి ఫామ్‌లో ఉన్న ఇతడు ధనుష్ 'ఇడ్లీ కడై' మూవీలో కీలక పాత్ర పోషించాడు. అక్టోబరు 01న ఈ చిత్రం తెలుగు, తమిళంలో థియేటర్లలోకి రానుంది. శనివారం సాయంత్రం ట్రైలర్ లాంచ్ జరగ్గా.. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సత్యరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

(ఇదీ చదవండి: నా పుట్టినరోజునాడే తను చనిపోయాడు.. హీరోయిన్ రాశి)

'రాజమౌళి, ధనుష్ ఇద్దరితో పనిచేయడం పోల్చిచూస్తే.. ధనుష్‌తో పనిచేయడమే కష్టం. ఎందుకంటే దర్శకుడిగా ధనుష్‌కి చాలా క్లారిటీ ఉంది. ఇడ్లీ కడై ఓ ఎమోషనల్ ఫీల్ గుడ్ ఎంటర్ టైన్‌మెంట్ సినిమా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఢమాల్ డుమాల్ అనే యాక్షన్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఇది అలాంటి మూవీ కాదు. ఇదో ఫీల్ గుడ్ మూవీ' అని సత్యరాజ్ చెప్పుకొచ్చాడు.

రాజమౌళి డైరెక్షన్ అంటే నటీనటులని బాగా కష్టపెడతాడనే పేరుంది. అలాంటిది ఈ డైరెక్టర్ కంటే ధనుష్‌ డైరెక్షన్‌లో పనిచేయడం కష్టమని సత్యరాజ్ చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇకపోతే ఈ మూవీ 'ఇడ్లీ కొట్టు' పేరుతో తెలుగులో రిలీజ్ కానుంది. మురళి అనే ఓ కుర్రాడు.. చెఫ్‌గా పెద్ద కంపెనీలో జాబ్ చేస్తాడు. కానీ వారసత్వంగా వచ్చిన ఓ ఇడ్లీ కొట్టు నడిపేందుకు తిరిగి సొంతూరికి వచ్చేస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మరి మూవీ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఒక్క సినిమాతో ఫేమస్‌.. కనిపించకుండా పోయిన ‘అందాల తార’!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)