Breaking News

శరత్ బాబు నటించిన చివరి సినిమా ఇదే!

Published on Mon, 05/22/2023 - 15:13

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 

(ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్‌ బాబు కన్నుమూత)

రామరాజ్యం సినిమాలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శరత్ బాబు.. సాగర సంగమం, సితార, సీతాకోక చిలక చిత్రాలతో గుర్తింపు సాధించారు. సాగర సంగమంలో కమల్ హాసన్ ఫ్రెండ్‌గా కనిపించాడు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఇలాంటి మిత్రుడు ప్రతీ ఒక్కరికి ఉండాలి అని మాట్లాడుకుంటున్నారు.

ఇక సితారలో మరో వైవిధ్యమైన పాత్ర వేసి మెప్పించాడు. ఆస్తులు అన్ని పోయినా పరువు కోసం ప్రాణం ఇచ్చే క్యారెక్టర్లో నటించి ఆకట్టుకున్నాడు. లోపల ఎంతో బాధ ఉన్న కూడా బయటకు మాత్రం గంభీరంగా కనిపించే క్యారెక్టర్‌లో అలరించాడు. ఎన్టీఆర్ లాంటి మహానటుడితో బంగారు మనిషి, లాయర్ విశ్వనాథం, శృంగార రాముడు, రామకృష్టుడు లాంటి సినిమాలలో నటించాడు.

(ఇది చదవండి: Sarath Babu: శరత్‌బాబుకు కలిసిరాని పెళ్లిళ్లు! మూడుసార్లు..)

కాగా.. ఆయన కెరీర్‌లో నటించిన చివరి చిత్రం మళ్లీ పెళ్లి. నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించారు. ఆయన ఇక లేడన్న వార్త విన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)