Breaking News

3 వేలమందిలో ఒకే ఒక్కడు..  దటీజ్ శరత్ బాబు!

Published on Mon, 05/22/2023 - 18:20

తెలుగు, తమిళ, మళయాళ చిత్రాల్లో శరత్‌ బాబు తనదైన నటనతో అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్నారు. శ్రీకాకులం జిల్లా ఆముదాలవలసలో జన్మించిన ఆయన పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నారు. కానీ అనుకోకుండానే నటనలో ప్రవేశించారు. 1973లో రామరాజ్యం సినిమాతో మొదలైన శరత్ బాబు ప్రస్థానం అంత సులభంగా సాగలేదు.  ఆయన సినిమాల్లో ఛాన్స్ కోసం చెన్నైకి వెళ్లారు. గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన శరత్ తొలి సినిమా ఛాన్స్ గురించి ఆసక్తిక విషయాలను పంచుకున్నారు. 

(ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్‌ బాబు కన్నుమూత)

ఇంటర్వ్యూలో శరత్ బాబు మాట్లాడుతూ.. 'మాకు ఊర్లో ‘గౌరీశంకర్‌’ అనే హోటల్‌ ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాల్లో మా హోటల్‌కు మంచి పేరు కూడా ఉండేది. అన్నయ్యతో పాటు నేను కూడా హోటల్‌ను చూసుకునేవాళ్లం. కాలేజీ అయిపోగానే అన్నయ్యకు హోటల్‌ పనుల్లో సాయంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో మద్రాసు వెళ్లమంటూ నా స్నేహితులు బలవంతం చేశారు. అప్పట్లో నా అభిమాన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారికి ఫొటోలు పంపాను. ఇంటర్వ్యూకు రమ్మని ఉత్తరం పంపారు. మద్రాసుకు వెళ్లాక నన్ను చూసిన సుబ్బారావు.. మళ్లీ కబురు పంపిస్తా.' అని అన్నారు. 

ఆయన మాటలకు ఆశ్చర్యపోయా!

సినిమా ఛాన్స్ రావడం పట్ల మాట్లాడుతూ..  'అయితే సుబ్బారావు ఎప్పుడు పిలుస్తారా అని మద్రాస్‌లోనే ఉన్నా. అప్పుడే రామా విజేత ప్రొడెక్షన్స్‌ వారు కొత్త హీరో కావాలని ప్రకటన ఇచ్చారు. ఆడిషన్‌కు 3000 మంది రాగా.. చివరకు నేనే సెలెక్ట్ అయ్యా. యూ ఆర్‌ ద హీరో ఆఫ్‌ మై పిక్చర్‌ అని దర్శకుడు బాబూరావు చెప్పడంతో ఆశ్చర్యపోయా. ఇదంతా నిజమేనా అనిపించింది. జగ్గయ్య, ఎస్వీ రంగారావు, చంద్రకళ, సావిత్రి.. ఇలా అగ్రహీరోలతో కలిసి నా మొదటి సినిమా ‘రామరాజ్యం కోసం పనిచేశా. 1973లో అది విడుదలైంది. హీరోగా తొలి ప్రయత్నంలోనే నాకు గుర్తింపు లభించింది.' అని అన్నారు. 

(ఇది చదవండి: కమెడియన్‌ సుధాకర్‌ చనిపోయాడంటూ ఫేక్‌ రూమర్స్‌..)

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)