Breaking News

నాపై ట్రోలింగ్‌.. ఆ ఒక్క పని చేస్తే చాలు: సారా అలీ ఖాన్

Published on Wed, 04/02/2025 - 20:04

సైఫ్ ‍అలీ ఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్‌ గురించి బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. సైఫ్ వారసురాలిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. కొత్త ఏడాదిలో స్కై ఫోర్స్‌తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సారా అలీ ఖాన్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా  సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఉద్దేశించి మాట్లాడింది. తన నటనపై సోషల్ మీడియాలో తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. అయినప్పటికీ అవీ నన్ను  పెద్దగా ఇబ్బంది పెట్టలేదని వివరించింది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ నుంచి బయటపడేందుకు ధ్యానం చేస్తానని తెలిపింది.

సారా అలీ ఖాన్ మాట్లాడుతూ.. "నేను సాధ్యమైనంత వరకు వాటిని ఫిల్టర్ చేయడం ప్రారంభించా. ఈ విషయంలో నాకు సహాయపడేది ధ్యానం. ఇలా చేయడం వల్ల నాకు నిజమేంటో తెలుస్తుంది. నేను నా స్వంత ఆలోచనలతో చూడటం ప్రారంభించా. ప్రతి ఆలోచనకు కూడా నన్ను సమర్థించుకోను. ఒక నటిగా నేను ఉన్నతమైన స్థానంలో లేను. కొంతమందికి కొందరు నటీనటులు అంటే ఇష్టం. మరికొందరికి ఇష్టం ఉండదు. నటిగా ఇంకా నేను  చాలా దూరం ప్రయాణించాలి. ఆ భగవంతుడు కోరుకుంటే సుదీర్ఘ జీవితం సినిమాల్లో ముందుకు సాగుతా. ఆ తర్వాత ప్రొడక్షన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై దృష్టి సారిస్తా.' అని తెలిపింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)