Breaking News

ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? నాగార్జునతో అప్పుడలా ఇప్పుడేమో

Published on Thu, 08/17/2023 - 21:17

ఈమెని మీరు కచ్చితంగా గుర్తుపట్టలేరు. ఎందుకంటే అప్పుడెప్పుడో 2002లో తెలుగులో ఫస్ట్ సినిమా చేసింది. అది కూడా నాగార్జునతో. కానీ బ్యాడ్ లక్. అదృష్టం కలిసి రాలేదు. సినిమా హిట్ కాలేదు. అయితేనేం మరో సినిమలో అవకాశమొచ్చింది. అదీ ఫెయిలైంది. దీంతో తెలుగు దర్శకనిర్మాతలు ఈమెని పట్టించుకోలేదు. మధ్యలో ఓ తెలుగు మూవీలో గెస్ట్ రోల్ చేసింది అంతే. అలాంటి ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఇంతకీ ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు గ్రేసీ సింగ్. ఈ పేరు ఎక్కడో విన్నట్లు, ఈమెని ఎక్కడో చూసినట్లు ఉంది కదా! అవును మీలో కొందరు కరెక్ట్‌గానే గెస్ చేశారు. 'సంతోషం' సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్‌గా చేసింది ఈమెనే. దిల్లీలో పుట్టి పెరిగిన ఈమె.. చిన్నప్పుడే భరతనాట్యం, ఒడిస్సీ లాంటి క్లాసికల్ డ్యాన్స్ నేర్చకుంది. అలా డాన్స్ గ్రూప్‌తో ప్రదర్శనలు ఇస్తూ గుర్తింపు తెచ్చుకుంది. పదిహేడేళ్లకే ఓ సీరియల్‌లో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. 19 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చేసింది. 

(ఇదీ చదవండి: ఆ రూమర్స్‌పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!)

అయితే 2001లో ఆమిర్ ఖాన్ 'లగాన్' సినిమా గ్రేసీ సింగ్‌కి కాస్త పేరు తీసుకొచ్చింది. తెలుగులో ఒకే ఏడాది(2002)లో 'సంతోషం', 'తప్పు చేసి పప్పుకూడు' సినిమాలు చేసింది కానీ కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. 2010లో మరోసారి టాలీవుడ్‌లో 'రామరామ కృష్ణ', 'రామ్ దేవ్' అనే చిత్రాల్లో యాక్ట్ చేసింది గానీ బ్యాడ్ లక్. దీంతో మళ‍్లీ హిందీ, పంజాబీలో 2015 వరకు సినిమాలు చేసింది. ఆ తర్వాత సీరియల్స్‌లో నటిస్తూ బిజీ అయిపోయింది.

ఈమె నటిగా చాలా పేరు తెచ్చుకున్నప్పటికీ డ్యాన్స్ మాత్రం అస్సలు విడిచిపెట్టలేదు. మొన్నీమధ్య ప్రధాని నరేంద్ర మోదీ ముందు బ్రహ్మకుమారీస్ తరఫున ఫెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అప్పట్లో అందంగా ఉన్న గ్రేసీ.. వయసు పెరిగేకొద్ది చాలా మారిపోయింది. తాజాగా ఆమె ఫొటోలు చూసి తెలుగు ప్రేక్షకులు కాస్త తికమక పడ్డారు. ఎవరో గుర్తొచ్చి కింద కామెంట్స్ చేశారు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న రానా తమ్ముడు! అమ్మాయి ఎవరంటే?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)