Breaking News

ధురంధర్‌ 2 కథ నాది.. కాపీ కొట్టారు: కన్నడ దర్శకుడు

Published on Wed, 04/01/2026 - 15:17

పాన్‌ ఇండియా స్థాయిలో మార్మోగిపోతున్న పేరు ధురంధర్‌ 2. ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ధురంధర్‌ లైఫ్‌టైమ్‌ కలెక్షన్స్‌ను రెండో భాగం ఈపాటికే దాటేసింది. ఒకటీరెండు రోజుల్లో రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ధురంధర్‌ 2 కథ తనదంటూ మీడియా ముందుకు వచ్చాడు కన్నడ దర్శకుడు సంతోష్‌ కుమార్‌ ఆర్‌ఎస్‌.

కష్టపడి కథ రాసుకున్నా..
ఆయన మాట్లాడుతూ.. ధురంధర్‌ 2 మీరంతా చూసే ఉంటారు. ఈ సినిమాకు అంతటా మంచి స్పందన లభిస్తోంది. అయితే ఆ కథ నాది. సినిమా చూసిన తర్వాత నా కథ కాపీ కొట్టారన్న విషయం అర్థమైంది. 2023లోనే ఎంతో కష్టపడి ఈ కథ రాసుకున్నాను. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. పెద్ద నటీనటులు ఈ మూవీలో భాగం కావాలంటే బడా సంస్థ అండగా ఉండాలన్నారు. 

2023లోనే రిజిస్టర్‌ చేయించా..
అందుకే జీ స్టూడియోస్‌, టీ సిరీస్‌, ధర్మ ప్రొడక్షన్స్‌, సోనీ పిక్చర్స్‌.. ఇలా అనేక పెద్ద నిర్మాణ సంస్థలను సంప్రదించాను. చాలామందికి నా కథ పంపాను. ఆదిత్య రాయ్‌ కపూర్‌ని హీరోగా పెట్టి మూవీ తీయాలనుకున్నాను. 2023 నవంబర్‌లోనే ఈ కథ రిజిస్టర్‌ కూడా చేయించాను. అందుకు సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. వీటి ఆధారంగా ధురంధర్‌ 2 మూవీ యూనిట్‌పై కేసు వేయాలనుకుంటున్నాను.

అదే బాధగా ఉంది
వాళ్లు నా కథను చెడగొట్టారు. నేను వినోదం కోసం కథ రాస్తే దాన్ని రాజకీయ దుర్వినియోగం చేశారు. అదే నాకు మరింత బాధ కలిగిస్తోంది. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. సంతోష్‌ కుమార్‌.. క్యాంపస్‌ క్రాంతి అనే కన్నడ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం యువన్‌ రాబిన్‌హుడ్‌ మూవీ చేస్తున్నాడు.

చదవండి: నీ ముఖానికి గోల్డ్‌ చైన్‌ వేసుకునేంత సీన్‌ ఉందా? నటి ఆవేదన

Videos

భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు

సినిమాలో యాక్టింగ్ పై మక్కువతో హైదరాబాద్ వచ్చి గుండెపోటుతో..!!

జగన్ ప్లాన్ - B.. రాజధానికి కొత్త పేరు..! MAVIGUN

లైట్.. కెమెరా.. యాక్షన్.. ఆస్కార్ లెవెల్ లో కూటమి యాక్టింగ్

అన్నం పెట్టిన అమ్మకు అంజలి ఘటించిన వానరం

హిందూమతం పునః స్వీకరణ.. భూమన కరుణాకర్ రెడ్డి ప్రోత్సహహంతోనే మళ్ళీ హిందూమతంలో చేరాం

మైత్రి మూవీ మేకర్స్ భారీ ప్లాన్... ప్రదీప్ కు ఊహించని రెమ్యూనరేషన్!

కేంద్రం కీలక నిర్ణయం... SIM Binding తప్పనిసరి...

పెళ్లి పందిట్లో బిర్యానీ లెగ్ పీస్ చిచ్చు

హనుమాన్ జయంతి వేడుకల్లో CP సజ్జనార్

Photos

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)

+5

సినీ కెరీర్‌.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దారులన్నీ కొండగట్టుకే.. భారీగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)

+5

వామ్మో ఎండలు.. (ఫొటోలు)

+5

డిజైన్లకే రూ.401కోట్లు ఖర్చు..ఏంది సామీ ఇదంతా!: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబం (ఫొటోలు)

+5

దేవతలా మిస్ ఇండియా నికితా పోర్వాల్‌..! (ఫొటోలు)

+5

'పల్లి చట్టంబి' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

‘బ్యాండ్‌ మేళం’ మూవీ థ్యాంక్ యూ మీట్‌ ఈవెంట్‌ (ఫొటోలు)