Breaking News

జాతీయ అవార్డులు అందుకున్న మూవీ.. 19 ఏళ్లకు ఓటీటీలో..

Published on Sun, 02/04/2024 - 12:44

దర్శకదిగ్గజం సంజయ్‌లీలా భన్సాలీ తీసే సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఆయన సినిమాలు ఎంత రిచ్‌గా ఉంటాయో అంతే ఎమోషనల్‌గా కూడా ఉంటాయి. తను తీసే ఒక్కో సినిమా ఒక్కో కళాఖండంలా ఉంటుంది. అలా ఆయన 19 ఏళ్ల క్రితం తెరకెక్కించిన ఓ మాస్టర్‌ పీస్‌ 'బ్లాక్‌'. టైటిల్‌ చూడగానే ఓ విషయం అర్థమైపోతుంది. హీరోహీరోయిన్లలో ఒకరికి అంధత్వం ఉందని తెలిసిపోతోంది. అవును, ఇందులో హీరోయిన్‌గా నటించిన రాణీ ముఖర్జీకి కనబడదు, వినబడదు.

అంధురాలు, అల్జీమర్‌ టీచర్‌ మధ్య లవ్‌..
ఆమెకు టీచర్‌ అమితాబ్‌ బచ్చన్‌తో అనుబంధం ఏర్పడుతుంది. కానీ అతడికి క్రమంగా అల్జీమర్స్‌(మతిమరుపు) వచ్చి ఆమెను మర్చిపోతాడు. ఆ ఇద్దరి మధ్య నడిచే డ్రామానే బ్లాక్‌. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్టయింది. ఎంతోమంది మనసులను మెలిపెడుతూ కంటతడి పెట్టించేలా చేసింది. అంతేకాదు, మూడు జాతీయ అవార్డులను ఎగరేసుకుపోయింది.

ఇన్నాళ్లకు ఓటీటీలో
అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేదు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది. నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ ఓటీటీలోకి వస్తే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నామో, ఫైనల్‌గా మా కల నెరవేరింది అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: పేరెంట్స్‌తో వెళ్లా.. నడిరోడ్డుపై అసభ్యంగా తాకుతూ, గిల్లుతూ...: హీరోయిన్‌

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)