Breaking News

బిగ్‌బాస్‌లో బాడీ షేమింగ్‌.. దివ్యపై సంజన వ్యాఖ్యలు

Published on Sat, 10/25/2025 - 11:43

బిగ్‌బాస్‌ షో అంటేనే బూతులకు కేరాఫ్‌ అంటూ చాలామంది విమర్శించడం చూస్తూనే ఉన్నాం. గతంలో సీపీఐ నారాయణ మరో అడుగు ముందుకేసి ఏకంగా బ్రోతల్‌ హౌస్‌ అని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలను చాలామంది తప్పుబట్టారు. అయితే, గతంలో ఎప్పుడూ లేనంత విమర్శలు బిగ్‌బాస్ 9వ సీజన్ మీద వస్తున్నాయి. రోజురోజుకూ షో మరీ దిగజారిపోయిందనే అభిప్రాయం కనిపిస్తుంది.

హౌస్‌లో నటి సంజన గల్రానీ ప్రవర్తన, ఆమె చేస్తున్న కామెంట్లు చాలా అభ్యంతరకంగానే ఉన్నాయి. వాటిని ఏకంగా టెలికాస్ట్‌ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏకంగా దివ్య అనే కామనర్‌ పట్ల సంజన బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు చేసింది.  దివ్య ఒక రోడ్‌ రోలర్‌ మాదిరిగా మీదికి ఎక్కేస్తుందంటూ రమ్యతో చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరోసారి కల్యాణ్‌ పట్ల కూడా ఆమె ఇలాగే ప్రవర్తించింది. తాను క్లాస్‌ అంటూ 'కల్యాణ్‌' లో క్లాస్‌ అంటూ పేర్కొంది. ఒక సెలబ్రిటీ (తనూజ) చుట్టూ తిరుగుతున్నావ్‌ అంటూ కల్యాణ్‌పై చీప్‌ కామెంట్లు చేసింది.

మరోసారి తనూజ పట్ల కూడా జలసీ రాణీ అంటూ హైపర్‌ అయిపోయింది. ఇలా సంజన పదేపదే నోరు జారడం పరిపాటిగా మారిపోయింది. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని షోలో టెలికాస్ట్‌ అవుతున్నాయి. మరికొన్ని లైవ్‌ ఎపిసోడ్స్‌లో వస్తున్నాయి. ఒకసారి తనూజ కూడా రాము రాథోడ్‌ను చాలా చులకన చేసి మాట్లాడిన సందర్భం ఉంది. ఇలాంటి ధోరణితో సమాజానికి ఏం చెప్పాలని బిగ్‌బాస్‌ చూస్తున్నాడు అంటూ కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌ను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. ఈ వారం వీకెండ్ ఎపిసోడ్‌లో సంజనను హోస్ట్‌ నాగార్జున నిలదీస్తారా..?  లేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఎప్పుడూ అరుపులు, బూతులు మాత్రమే వినిపిస్తున్నాయ్‌ అంటూ అభిప్రాయం కనిపిస్తుంది. బిగ్‌బాస్‌లో ఈసారి ఎక్కువగా కాంట్రవర్సీ కేరక్టర్లను ప్రవేశపెట్టారని తెలుస్తోంది. దీంతోనే ఎక్కువ వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)