క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు
Breaking News
ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
Published on Mon, 03/30/2026 - 14:42
నోరు జారిన కారణంగా రీసెంట్ టైంలో పలు వివాదాల్లో ఇరుక్కున్న నటుడు శివాజీ.. గతేడాది 'కోర్ట్' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ కాస్త బిజీగానే ఉన్నాడు. లేటెస్ట్గా ఈయన ఓ చిత్రాన్ని నిర్మించి అందులో లీడ్ రోల్ చేశారు. లయ జంటగా నటించింది. ఈ సినిమా ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులో రానుంది?
(ఇదీ చదవండి: విషాదం.. సముద్రంలో పడిపోయి హీరో కన్నుమూత)
సుధీర్ శ్రీరామ్ దర్శకుడిగా శివాజీ-లయ జంటగా నటించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాని తొలుత ఓటీటీ కోసమే తీశారు. కానీ ఏమైందో ఏమో ఈ నెల 6న థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ శుక్రవారం(ఏప్రిల్ 03) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' విషయానికొస్తే.. శ్రీరామ్ (శివాజీ) పంచాయతీ కార్యదర్శి. హర్స్‌లీ హిల్స్‌లో భార్య ఉత్తర(లయ), కొడుకు బిట్టు(రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. దీపావళి నాడు వీళ్ల ఇంటికి ఎస్సై విక్రమ్ వాసుదేవ్(ప్రిన్స్) వస్తాడు. ఇతడికి ఆడవాళ్ల పిచ్చి. శ్రీరామ్ ఇంట్లో లేడని తెలిసి ఉత్తరపై బలత్కారం చేయబోతాడు. అనుకోని విధంగా బిట్టు చేతిలో ఎస్సై హత్యకు గురవుతాడు. తర్వాత ఏమైంది? హత్య కేసు నుంచి శ్రీరామ్ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'ప్రేమిస్తే' ఆడిషన్‌కు గ్రీజు పూసుకుని వెళ్లా..)
Tags : 1