Breaking News

ఆ విషయంలో థ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నా: సమంత

Published on Fri, 11/03/2023 - 19:08

స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్‌లో సందడి చేసింది. ఈ దీపావళికి ఫ్యాన్స్‌కు సర్‌ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. తన అభిమానుల కోసం మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తోన్న ‘దిమార్వెల్స్ యూనిట్‌తో జతకట్టింది. అమెరికన్ సూపర్ హీరోస్‌కు తానెప్పుడూ అభిమానినని చెప్పే సమంత.. ది మార్వెల్స్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.  తాజాగా భారతీయ అభిమానుల కోసం ప్రత్యేక ప్రోమోను లాంఛ్ చేశారు. తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో  సమంత స్పెషల్‌గా కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన యాక్షన్, అడ్వెంచర్ చిత్రం ది మార్వెల్స్‌ నవంబర్ 10న ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సమంత మాట్లాడుతూ..'కెప్టెన్ మార్వెల్ ఎప్పుడూ నాకు అత్యంత ఇష్టమైన సూపర్ హీరో. అవెంజర్, ఈ ఎపిక్ దీపావళి ఎంటర్‌టైనర్‌ కోసం మరోసారి మార్వెల్ ఇండియా తో జతకట్టడం థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతున్నా. ఒకరు కాదు ముగ్గురు శక్తివంతమైన సూపర్ హీరోలు ఈసారి చెడుపై మంచి సాగించే అంతిమ యుద్ధంలో పోరాడుతున్నారు. మార్వెల్స్ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ సినిమా కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.' అని అన్నారు. కాగా.. 2019లో విడుదలై సూపర్‌ హిట్‌ అయిన ‘కెప్టెన్ మార్వెల్’ ప్రమోషన్స్‌లోనూ సమంత భాగమైన సంగతి తెలిసిందే. 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)