నాన్న మరణించిన రోజు.. నవ్వుతూ ఫోటోలు దిగా: సమంత

Published on Sun, 05/11/2025 - 19:20

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇప్పుడు హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాత కూడా. శుభం మూవీతో నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇ‍చ్చింది. ప్రస్తుతం ఆమె నిర్మించిన శుభం సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పుడు నిర్మాతగా మారిపోయిన సామ్.. ఇటీవల పలు ఇంటర్వ్యూలకు హాజరైంది. ఈ నేపథ్యంలో ఓ బాధాకర సంఘటనను వెల్లడించింది. తన తండ్రి అంత్యక్రియలకు వెళ్తంటే కొంతమంది సెల్ఫీలు అడిగారని గుర్తు చేసుకుంది.

సమంతా తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అభిమానులు తన దగ్గరికి ఫోటోలు తీయడానికి వచ్చినప్పుడు తాను ఎప్పుడూ నో చెప్పలేదు. చెన్నైలో తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలోనే కొంతమంది అభిమానులు ఫోటో తీయడానికి తన దగ్గరికి వచ్చారు. అయినా నేను వారికి నో చెప్పలేదు. ఎందుకంటే తన విజయానికి కారణం తన అభిమానులే. మనం సెలబ్రిటీలు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నామో వారికి తెలియకపోవచ్చు. అందుకే నేనెప్పుడూ అభిమానుల ఫోటోలకు నో చెప్పను' అని ఆ సంఘటనను గుర్తు చేసుకుంది

ఆ రోజును గుర్తుచేసుకుంటూ.. 'డిసెంబర్‌లో నాన్న మరణించారని నా తల్లి నుంచి ఉదయం నాకు ఫోన్ వచ్చింది. నేను వెంటనే ముంబయి నుంచి చెన్నైకి విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. కొంతకాలంగా నాన్నతో మాట్లాడకపోవడంతో నేను షాక్‌కు గురయ్యాను. నాలో ఎలాంటి స్పందన లేకుండా విమానంలో కూర్చుండిపోయా. ఆ సమయంలో కొందరు నా ఫోటో కోసం అడిగిన విషయం నాకు గుర్తుంది. నేను నిలబడి వారితో ఫోటోలకు నవ్వుతూ ఉన్నా" అని తెలిపింది. మనం ఏ స్థితిలో ఉన్నారో వారికి తెలియదు.. తెలియనివారితో ఫోటో అడగడానికి చాలా ధైర్యం అవసరం.. అందుకే నో చెప్పి వారిని బాధపెట్టాలని అనుకోలేదని సమంత వెల్లడించింది.

ఆ సంఘటన తనను ఒక సెలబ్రిటీగా ఉండటంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఆలోచించేలా చేసిందని సమంత పేర్కొంది. వారితో సెల్ఫీల కోసం నేను నవ్వుతున్నప్పుడు అది నా మనసును తాకిందని.. ఎందుకంటే తండ్రి మరణించిన రోజున ఏ వ్యక్తి నవ్వాలని అనుకోడని వివరించింది. ఇది పూర్తిగా వేరే ప్రపంచమని సమంత తెలిపింది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత 'బంగారం' అనే మూవీలో కనిపించనుంది.
 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)