Breaking News

చైతూ టాటూ తొలగించిన సమంత.. నెటిజన్ల రియాక్షన్‌ చూశారా?

Published on Sun, 03/16/2025 - 19:11

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన సమంత ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో చేయడం లేదు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలో మాత్రమే కనిపించింది. ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా డేటింగ్ వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరుతో సామ్ రిలేషన్‌లో ఉన్నట్లు చాలా సార్లు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరు కలిసి తరచుగా ఈవెంట్లకు హాజరు కావడంతో ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి.

ఇవన్నీ పక్కనపెడితే తాజాగా సోషల్ మీడియాలో సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాను నిర్మిస్తోన్న కొత్త మూవీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అందులో తన టీమ్‌తో ఉన్న ఫోటోలకు వరుసగా క్యాప్షన్‌ ఇస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే సామ్ షేర్ చేసిన తొలి ఫోటోపైనే అందరి కళ్లు పడ్డాయి. ఎందుకంటే ఆ ఫోటోలో సామ్ చేతికి టాటూ కనిపించడమే కారణం. టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య ప్రేమలో ఉన్నప్పుడు ఆ టాటూ వేయించుకుంది. ప్రస్తుతం ఆ టాటూను తొలగించుకున్నప్పటికీ.. కొద్ది కొద్దిగా కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి నాగచైతన్యకు గుర్తుగా వేయించుకున్న టాటూను తొలగించుకున్నారంటూ కొందరు కామెంట్స్ చేశారు. సమంత ఎట్టకేలకు చైతూ టాటూను తొలగించినట్లు కనిపిస్తోందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇప్పటి నుంచి మీ స్వంత రియాలిటీని సృష్టించండి అంటూ రాసుకొచ్చారు. టాటూను తొలగించుకున్నందుకు మంచిది.. ఇకపై మీ భాగస్వామి పేరును ఎప్పుడూ టాటూలుగా వేయించుకోకండి అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు.  అయితే ఈ ఫోటోలతో పాటు ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న పిక్‌ను కూడా సమంత పోస్ట్ చేసింది.

కాగా.. చైతూ సినిమాలో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సమంత.. చాలా కాలం పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే వీరిద్దరూ విడిపోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆ ఆ తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)