Breaking News

సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?

Published on Sun, 05/03/2026 - 17:38

సమంత ఒకప్పుడు స్టార్ హీరోయినే కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎంతలా అంటే ఈమె సినిమా మరో రెండు వారాల్లో రిలీజ్ అవుతుందనే సంగతే జనాలకు తెలియనంతగా! కొన్నిరోజుల క్రితం కమెడియన్ వెన్నెల కిశోర్‌తో ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఒకటి రిలీజ్ చేశారు గానీ అదేం వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. తీరా కట్ చేస్తే 'పెద్ది' వల్ల ఏర్పడిన కన్ఫ్యూజన్ దెబ్బకు సమంత సినిమా ఏకంగా రెండు నెలలు వాయిదా పడిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య)

చివరగా విజయ్ దేవరకొండ 'ఖుషి'లో హీరోయిన్‌గా కనిపించిన సమంత.. తర్వాత ఓ వెబ్ సిరీస్ చేసింది గానీ సక్సెస్ అందుకోలేకపోయింది. గతేడాది రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి మరోసారి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే 'మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ వేసవిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్లే మే 15న వస్తుందని పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు.

మరి ఏమైందో ఏమో జూన్ తొలివారానికి వాయిదా పడే అవకాశముందనే రూమర్స్ వచ్చాయి. ఇంతలో 'పెద్ది'.. జూన్ 4 అనేసరికి 'మా ఇంటి బంగారం' ఆలోచనలో పడింది. ఇప్పుడు మే, జూన్ కాదు ఏకంగా జూలైకి వాయిదా వేశారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమో కాదో రాబోయే కొన్నిరోజుల్లో క్లారిటీ వస్తుంది.

నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత.. గృహిణి పాత్ర చేసింది. కానీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని టీజర్‌తో క్లారిటీ వచ్చేసింది. అయితే ఔట్‌పుట్ అంతా సిద్ధమైన వాయిదా వేయడం, అది కూడా రెండు నెలలు పాటు అనేది కాస్త చిత్రంగా అనిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మూవీపై ఉన్న హైప్ కూడా తగ్గిపోయే ప్రమాదముంది. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి?

(ఇదీ చదవండి: రజనీ సినిమాలో చిరంజీవి భార్య.. భర్తని తలుచుకుని ఎమోషనల్)

Videos

మంత్రి టీజీ భరత్ అనుచరుడు వేధింపులకు యువకుడు బలి

వెరీ సాడ్.. ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం.. AI వీడియో..

స్టాఫ్ చేతులు కట్టేసి.. సంచుల నిండ బంగారంతో పరార్..

ఇంట్లో మొగుడు.. ఫోన్లో ప్రియుడు.. కొంపముంచుతున్న డేటింగ్ యాప్‌లు..

అయ్యో పాపం.. సాయి పల్లవి.. మొదటి అడుగే ఇలా అయ్యిందేంటి?

పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఖతం.. దురంధర్ పనేనా..?

ఒక్కటైన పాత మిత్రులు..

కరీంనగర్ జువెల్లరీ షాప్ లో దోపిడీ Live వీడియో

YSRCP నేత దశరథరామిరెడ్డితో పాటు పలువురిపై మంత్రి అనుచరుల దాడి

ఘటనకు ముందు నేను అక్కడే ఉన్న? కాల్పులపై బండి సంజయ్ రియాక్షన్

Photos

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)

+5

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)

+5

నిర్మాత కూతురి పెళ్లి రిసెప్షన్‌లో టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

రోజురోజుకీ మరింత అందంగా కాజల్ అగర్వాల్ (ఫొటోలు)

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)