'ఇక్కడికి వస్తే బ్లాక్ బస్టరే'.. తీవ్ర భావోద్వేగానికి గురైన సమంత!

Published on Mon, 05/05/2025 - 08:36

సమంత ఇప్పుడు హీరోయిన్ మాత్రమే కాదు... నిర్మాత కూడా. తాను స్వయంగా నిర్మించిన తాజా చిత్రం శుభం. ఆమె నిర్మాతగా మారి రూపొందించిన తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో హర్షిత్‌ రెడ్డి, సి. మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్‌ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సినిమా బండి మూవీ ఫేమ్‌ ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ గ్రాండ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నిర్మాతగా సమంత కూడా హాజరయ్యారు. వైజాగ్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో సామ్ సందడి చేశారు. ఈ సందర్భంగా వైజాగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైజాగ్ వస్తే ఏ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవ్వాల్సిందేనని సామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో మజిలీ, ఓ బేబీ, రంగస్థలం సినిమాల్లాగే నాకు మళ్లీ బ్లాక్‌ బస్టర్ ఇస్తారని అనుకుంటున్నా అని మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలనేదే నా లక్ష్యమని సమంత తెలిపారు. భవిష్యత్తులో అందరినీ ఆకట్టుకునే కథలను మీ ముందుకు తీసుకు రావాలని ఆశిస్తున్నానని సామ్ వెల్లడించారు. మీ ప్రేమ వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానని.. మీరు లేకపోతే నేను నథింగ్ అంటోంది టాలీవుడ్ బ్యూటీ.

అయితే ఈ ఈవెంట్‌లో సమంత ఫుల్ ఎమోషనల్ అయింది. ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది. ఈవెంట్‌లో జరుగుతున్న సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తన సినీ కెరీర్‌ను తలచుకుని సామ్ ఎమోషనల్ కావడంతో ఫ్యాన్స్‌ సైతం భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 

 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)