Breaking News

Samantha: సమంత మయోసైటిస్‌ నుంచి ఇంకా కోలుకోలేదా?

Published on Tue, 01/10/2023 - 08:10

‘‘జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఒక్కటి మాత్రం మారలేదు. సినిమాను నేను ఎంతలా ప్రేమిస్తానో... సినిమా కూడా నన్ను అంతలా ప్రేమిస్తోంది. ‘శాకుంతలం’తో మీ ప్రేమ మరింత పెరుగుతుందని నమ్ముతున్నాను’’ అని సమంత అన్నారు. గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత లీడ్‌ రోల్‌లో నటింన చిత్రం ‘శాకుంతలం’. ‘దిల్‌’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మింన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

ఈ చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ– ‘‘ఓపిక లేకపోయినా గుణశేఖర్‌గారిపై ఉన్న అభిమానం, గౌరవంతో నా బలం మొత్తాన్ని కూడగట్టుకుని ఇక్కడికి వచ్చాను. కొందరికి సినిమా అనేది జీవితంలో ఓ భాగం. కానీ, గుణశేఖర్‌గారికి సినిమానే జీవితం. ప్రతి సినిమాలానే ‘శాకుంతలం’ని కూడా ఆయన ప్రాణం పెట్టి తీశారు. ఏ కథ విన్నా సినిమా బాగా రావాలని నటీనటులు కోరుకుంటారు. కొన్నిసార్లు ఆ ఊహను దాటి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి..‘శాకుంతలం’ చూశాక నాకు అదే భావన కలిగింది’’ అన్నారు.

‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘గుణశేఖర్‌గారు ‘శాకుంతలం’ కథ చెప్పినప్పుడు లీడ్‌ రోల్‌లో సమంత అయితే సరిపోతారనుకున్నాం. కథ విని, సమంత కూడా ఓకే అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ఒరిజినల్‌ పాన్‌ ఇండియా సినిమా ఇది’’ అన్నారు. గుణశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘శాకుంతలం’లో ముగ్గురు హీరోలున్నారు. కథకు హీరో దేవ్‌ మోహన్‌ , సినిమాకు హీరో సమంత, తెరవెనక హీరో ‘దిల్‌’ రాజుగారు.

ఇండియాలో వచ్చిన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల్లో అతి పెద్ద బడ్జెట్‌ సినివ్చన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల్లో అతి పెద్ద బడ్జెట్‌ సినిమా ‘శాకుంతలం’. ఓ హీరోయిన్‌ని నమ్మి ఇంత బడ్జెట్‌ పెట్టిన రాజుగారికి థ్యాంక్స్‌. (చెమర్చిన కళ్లతో)’’ అన్నారు. గుణశేఖర్‌ మాటలకు సమంత భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ‘‘మా నాన్న ఎన్నో విజువల్స్‌ వండర్స్‌ సృష్టించారు. ‘శాకుంతలం’ ఆయనకు పూర్వ వైభవం తెస్తుంది’’ అన్నారు నీలిమ గుణ.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)