Breaking News

Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?

Published on Tue, 01/16/2024 - 16:13

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంక్రాంతి హడావుడి గట్టిగా నడుస్తోంది. మరోవైపు పండగ బరిలో నాలుగు సినిమాలు రిలీజ్ కాగా, చాలామందికి 'హనుమాన్' గట్టిగా నచ్చేసింది. దీని తర్వాత 'గుంటూరు కారం', 'సైంధవ్', 'నా సామి రంగ' చూస్తున్నారు. వీటితోపాటే డిసెంబరు చివర్లో వచ్చిన 'సలార్' కూడా ఇంకా థియేటర్లలో అక్కడక్కడా స్క్రీన్ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రభాస్ 'సలార్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?)

'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలైతే చేస్తున్నాడే గానీ సరైన హిట్ అయితే పడలేదు. దీంతో అందరూ 'సలార్'పై అంచనాలు బాగా పెట్టుకున్నారు. వాటిని అందుకోవడంలో కాస్త తడబడింది గానీ ఓవరాల్‌గా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్ రన్ పూర్తయ్యేటప్పటికి రూ.800 కోట్ల మార్క్ దాటేయొచ్చు.

ఇకపోతే 'సలార్' డిజిటల్ హక్కుల్ని ప్రముఖ సంస్థ నెట్‌ఫ‍్లిక్స్ దక్కించుకుంది. సంక్రాంతి పండగ సందర్భంగా మరోసారి ఇందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలోకి వచ్చిన 45 రోజుల తర్వాత అనే అగ్రిమెంట్ ప్రకారం ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్ లోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఈ తేదీకి కుదరకపోతే ఫిబ్రవరి 9న ఓటీటీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరో వారంలో దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో అప్పటివరకు వెయిట్ అండ్ సీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)