Breaking News

'ఛావా' రికార్డ్ బ్రేక్ చేసిన చిన్న సినిమా

Published on Thu, 07/31/2025 - 14:59

చిన్న సినిమాలు అప్పుడప్పుడు అద్భుతాలు చేస్తుంటాయి. ఇప్పుడు కూడా 'సయారా' అనే బాలీవుడ్ మూవీ ఎవరూ ఊహించని కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. అలానే కొన్ని రికార్డ్స్‌ని కూడా బ్రేక్ చేస్తోంది. ఇప్పుడు అలానే ఏకంగా 'ఛావా'ని దాటేయడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: బర్త్‌డే ప్రకటన.. గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్‌)

విక్కీ కౌశల్, రష్మిక నటించిన చారిత్రక సినిమా 'ఛావా'. ఛత్రపతి శివాజీ కుమారుడి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం.. ఊహించని వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు ఆ నంబర్లని 'సయారా' అధిగమించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన 'ఛావా'.. ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర రూ.91 కోట్లు సాధించింది. ఇప్పుడు ఆ నంబర్‌ని సయారా.. కేవలం 13 రోజుల్లోనే అధిగమించిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇప్పటివరకూ సయరా సినిమాకు ఓవర్సీస్‌లో రూ.94 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

ఓవరాల్‌గా చూసుకుంటే యువతని ఆకట్టుకుంటున్న సయారా చిత్రానికి ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ ఈ మధ్యనే చెప్పుకొచ్చింది. కేవలం మన దేశంలోనే రూ.260 కోట్లు వరకు వచ్చాయని సమాచారం. పరిస్థితి చూస్తుంటే రూ.500 కోట్ల మార్క్ కూడా మరికొన్నిరోజుల్లో దాటేయడం గ్యారంటీ. ఇంతకీ సయారా బడ్జెట్ ఎంతనుకున్నారు? కేవలం రూ.30 కోట్లు. ఈ లెక్కన చూసుకుంటే నిర్మాణ సంస్థకు వేరే లెవల్ లాభాలు వచ్చినట్లే.

(ఇదీ చదవండి: ఫిష్ వెంకట్ ఘటన మరవకముందే మరో విషాదం)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)