Breaking News

సైఫ్‌ అలీఖాన్‌ కుమారుడి తొలి సినిమా.. నేరుగా ఓటీటీలో రిలీజ్‌

Published on Sat, 02/01/2025 - 14:24

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali Khan) తనయుడు ఇబ్రహీం అలీఖాన్‌ నటుడిగా బిగ్‌ స్క్రీన్‌కు పరిచయం కాబోతున్నాడు. ఎంతోమంది స్టార్‌ కిడ్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ (Karan Johar) బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి నడానియన్‌ (Nadaaniyan) అన్న టైటిల్‌ ఖరారు చేశారు. దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సునీల్‌ శెట్టి, దియా మీర్జా, జుగల్‌ హన్సరాజ్‌, మహిమా చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఓటీటీలో రిలీజ్‌ కానున్న ఫస్ట్‌ మూవీ
ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే రిలీజ్‌ ఎప్పుడన్నది చెప్పకుండా త్వరలోనే అంటూ సస్పెన్స్‌లో ఉంచింది. ఈ సినిమాతో షావునా గౌతమ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈయన 'రాకీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీ' సినిమాకు కరణ్‌ జోహార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు.

ఇబ్రహీం..
సైఫ్‌ అలీఖాన్‌, అతడి మాజీ భార్య అమృతా సింగ్‌ తనయుడే ఇబ్రహీం. మొదటి భార్యకు విడాకులిచ్చిన అనంతరం సైఫ్‌.. హీరోయిన్‌ కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి తైమూర్‌, జెహంగీర్‌ అని ఇద్దరు కుమారులు సంతానం.

 

 

చదవండి: అంకుల్‌ అనొద్దన్నాడు.. కావాలంటే అలా పిలవమన్నాడు: కీర్తి సురేశ్‌

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు