Breaking News

సాయి పల్లవి మొదటి సినిమా.. అందుకేనా టెన్షన్..!

Published on Tue, 03/17/2026 - 08:13

ఎవరికైనా తొలి చిత్రం రిజల్ట్స్‌ కోసం ఆసక్తి ఉంటుంది. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటీనటులకు కూడా తమ కొత్త సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో లేదో అన్న టెన్షన్‌ ఉంటుంది. నటి సాయిపల్లవి కూడా ఇప్పుడు అలాంటి టెన్షన్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఏమిటీ తొలి చిత్రం అని ఆశ్యర్యంగా ఉందా? డాక్టర్‌ అయ్యి యాక్టర్‌ అయిన తమిళనాడు, నీలగిరి ప్రాంతానికి చెందిన భామ సాయిపల్లవి.

నటనపై ఆసక్తితో నాట్యాన్ని కూడా నేర్చుకున్న ఈమె మొదట్లో కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. అలా మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రం సాయిపల్లవి దశను మార్చేసింది. ఆ చిత్ర విజయం ఈ అమ్మడిని దక్షిణాది చిత్రపరిశ్రమలో పాపులర్‌ చేసింది. అలా తెలుగులో నటించిన పలు చిత్రాలు హిట్‌ అవ్వడం, తమిళంలోనూ అవకాశాలు రావడంతో స్టార్‌ హీరోయిన్‌ అయ్యారు.

ఇటీవల సాయిపల్లవి తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించిన అమరన్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో సాయిపల్లవి నటన పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తమిళంలో ధనుష్‌కు జంటగా నటించడానికి సిద్ధం అవుతున్నారు.

ఈ విషయాన్ని పక్కన పెడితే పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను తెచ్చుకున్న సాయిపల్లవి ఏక్‌దిన్‌ అనే చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. దీని తరువాత రామాయణం ఇతిహాసంతో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. ఏక్‌ దిన్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే నెలలో తెరపైకి రానుంది. ఇది థాయ్‌లాండ్‌ భాషలో రూపొందిన ఒన్‌ డే చిత్రానికి రీమేక్‌ అని తెలిసింది. ఇందులో అమీర్‌ఖాన్‌ వారసుడు జునైద్‌ఖాన్‌ హీరోగా నటించారు.

జునైద్ ఖాన్ ఈయన ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. అవీ పెద్దగా ఆశించిన విజయాలను అందుకోలేదు. దీంతో ఏక్‌దిన్‌ నటి సాయిపల్లవికి.. నటుడు జునైద్‌ఖాన్‌లకు చాలా ముఖ్యమైన చిత్రంగా నిలవనుంది. వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర ఫలితాలపై నటి సాయిపల్లవి చాలా ఆతృతగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్ర ఫలితం తన కెరీర్‌పై చాలా ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.  

Videos

ప్రజా దర్బార్ లో పేదలను అవమానించిన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ

103 డాలర్లకు చమురు ధర

దొంగచాటుగా హర్ముజ్ జలసంధిని దాటుతున్న నౌకలు

కూటమి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ భారీ నిరసన

సీపీ సతీమణి ఏకే 47 గన్ తో 10 రౌండ్ల కాల్పులు

శత్రుల రాడార్లను ముప్పు తిప్పలు పెట్టె ఇరాన్ మిస్సైల్

Sec-Bad: 800 కిలోల కుళ్లిన చికెన్

ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు.. BR నాయుడు రాసలీలలపై జగన్ సెటైర్లు

ఇది కదా తండ్రి ప్రేమంటే కొడుకు పరీక్ష కోసం ఏం చేశాడంటే

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

తమ్ముడి పిల్లల బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ బాబు (ఫోటోలు)

+5

ఆస్కార్‌ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)