Breaking News

నేను డబ్బులు ఇవ్వలేదు, కానీ రుణపడి ఉంటాను : సాయితేజ్‌

Published on Thu, 04/27/2023 - 20:00

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయితేజ్‌ను అబ్దుల్‌ ఫర్హాన్‌ అనే వ్యక్తి సకాలంలో ఆసుపత్రికి తరలించి సాయమందించాడు. దీంతో సాయితేజ్‌ను కాపాడినందుకు మెగా ఫ్యామిలీ అబ్దుల్‌కు కారు, బైకు, లక్ష రూపాయల వరకు నగదు.. ఇలా వరాలు కురిపించారంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై తొలిసారి అబ్దుల్‌ స్పందించాడు. చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన సంయుక్తా మీనన్‌ 

తేజ్‌ నుంచి, ఆయన కుటుంబం నుంచి ఎలాంటి సాయం అందలేదని, ఇలా అసత్య ప్రచారం వల్ల గతంలో పనిచేసే చోట జాబ్‌ కూడా మానేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ వల్ల తాను చాలా ఇబ్బందులు పడినట్లు అబ్దుల్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. అది కాస్తా సాయితేజ్‌ దగ్గరకు వెళ్లడంతో ఆయన స్పందించక తప్పలేదు. 

'అబ్దుల్‌ ఫర్హాన్‌కు సాయం చేసినట్లు నేను, నా టీమ్‌ ఎక్కడా చెప్పలేదు. కావాలంటే ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించాను. ఆయన ఫ్యామిలీకి మేం ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఆయన వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఫోన్‌ చేయమని నా మేనేజర్‌ నెంబర్‌ ఇచ్చాను' అంటూ తేజ్‌ ​క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ విషయంలో ఇకపై తాను మాట్లాడాలనుకోవట్లేదని కూడా పేర్కొన్నాడు. చదవండి: ప్రతీకారంతో జైలుపాలు.. డ్రగ్స్‌ కేసులో నిర్దోషిగా తేలిన హీరోయిన్‌ 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)