Breaking News

సఃకుటుంబానాం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Published on Thu, 01/01/2026 - 21:03

టైటిల్: సఃకుటుంబానాం
నటీనటులు..: రామ్ కిరణ్, మేఘ ఆకాష్, రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్ తదితరులు
దర్శకుడు..: ఉదయ్ శర్మ
నిర్మాతలు..: మహదేవ్ గౌడ్, నాగరత్న
విడుదల తేదీ..: జనవరి 01, 2026

రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటించిన తాజా చిత్రం సకుటుంబానాం. ఉదయ్ శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..

సాధారణ మధ్యతరగతి కుటుంబంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (రామ్ కిరణ్) తన కుటుంబంపై అపారమైన ప్రేమ చూపిస్తాడు. అతనిది ప్రశాంతమైన జీవితం.. మంచి జీతం. అయితే ఒక అమ్మాయి తన టీమ్‌లో చేరడంతో ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. అలా ఆమెను తన కుటుంబానికి పరిచయం చేస్తాడు. కానీ ఆమె రాకతో కుటుంబంలో వచ్చే పరిణామాలు ఏంటి? ఆ తర్వాత బయటపడే రహస్యాలు.. అతని జీవితంలో వచ్చే పరివర్తనలు ఏంటి? చివరికి కుటుంబం మొత్తం ఐక్యంగా ఉంటుందా? అసలు అతనికి ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? విలన్ వారి జీవితాల్లోకి ఎలా ప్రవేశిస్తాడు? ఈ ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

కుటుంబ విలువలను, విభేదాలను ఎలా సమతుల్యం చేయాలో దర్శకుడు చూపించాడు. అవీ కుటుంబ బంధాలను ఎంత బలోపేతం చేస్తాయో ఈ కథలో మేసేజ్ ఇచ్చాడు. కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చిన సకుటుంబానాం టైటిల్‌ తగ్గట్టుగానే కథను ఎంచుకున్నారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్‌ ఉద్యోగం, ప్రేమ చుట్టే కథ తిరుగుతుంది.

ఇక సెకండాఫ్‌లోనే అసలు కథ మొదలవుతుంది. కుటుంబంలో జరిగే పరిణామాల చుట్టే స్టోరీని నడిపించాడు. అ‍క్కడక్కడా కొన్ని సీన్స్‌ రోటీన్‌గా అనిపిస్తాయి. ప్రేక్షకుడి బోర్ కొట్టించేలా కూడా ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. కథ పరంగా డైరెక్టర్‌ తన విజన్‌కు తగినట్లుగానే తెరకెక్కించాడు. తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను ప్రేక్షకుడికి వివరించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సరికొత్త కథాంశంతో వెండితెరను అలరించడంలో దర్శకుడు ఉదయ్ శర్మ విజయవంతమయ్యాడు. ఓవరాల్‌గా చూస్తే కుటుంబ సమేతంగా చూడదగిన అద్భుత చిత్రమే సకుటుంబానాం.

ఎవరెలా చేశారంటే..

హీరోగా పరిచయమైన రామ్ కిరణ్ తన డ్యాన్స్, నటనతో ఆకట్టుకున్నాడు.  హీరోయిన్ మేఘ ఆకాష్ తనదైన నటనతో అదరగొట్టేసింది. రాజేంద్రప్రసాద్ తండ్రి పాత్రలో జీవించేశాడు. బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, భద్రం, నిత్య, రచ్చ రవి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. సినిమాటోగ్రాఫర్ మధు దాసరి పనితీరు బాగుంది. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు, నృత్యాలు సినిమాకు పెద్ద ప్లస్. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. శశాంక్ మలి తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది.

రేటింగ్ : 2.5 /5

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)