Breaking News

దిగ్గజ సచిన్‌ని ఫిదా చేసిన సౌత్ సినిమా

Published on Tue, 08/26/2025 - 13:45

సినిమాకు ఒకప్పుడు హద్దులు ఉండేవి. ఏ ఇండస్ట్రీ మూవీస్ ఆయా రాష్ట్రాల్లో మాత్రమే ఆడేవి. ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని భాషా హద్దులు లేకుండా పోయాయి. దీంతో సామాన్యుల నుంచి స్టార్స్ వరకు కొత్త మూవీస్ ఎప్పటికప్పుడు చూస్తున్నారు. వాటి గురించి సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. అలా దిగ్గజ సచిన్ టెండుల్కర్‌కి కూడా ఈ మధ్య రిలీజైన ఓ తమిళ సినిమా నచ్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు.

(ఇదీ చదవండి: లావు తప్ప మరేదీ కనపడదా..? హీరోయిన్‌ ఆక్రోశం)

రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సచిన్.. రీసెంట్‌గా రెడిట్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా సినిమాల గురించి అడగ్గా.. ఈ మధ్య కాలంలో తనకు 3 బీహెచ్‪‌కే, అత తంబైచ నాయ్ అనే చిత్రాలు నచ్చాయని చెప్పుకొచ్చారు. వీటిలో ఒకటి తమిళ్ కాగా, మరొకటి మరాఠీ మూవీ. 3 బీహెచ్‪‌కే సినిమా విషయానికొస్తే.. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన సిద్ధార్థ్, శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

మధ్య తరగతి కుటుంబం.. సొంత ఇంటి కలని నిజం చేసుకునే క్రమంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది? చివరకు సొంత ఇల్లు కట్టుకోగలిగారా లేదా అనే స్టోరీతో తీసిన ఈ చిత్రం.. చాలామంది మిడిల్ క్లాస్ యువతకు కనెక్ట్ అయింది. శ్రీ గణేశ్ దీనికి దర్శకుడు. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు సచిన్ కూడా ఈ మూవీ తనకు నచ్చిందని చెప్పడంతో సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతోంది.

(ఇదీ చదవండి: రజనీకాంత్ సలహా.. ఆ పని ఎప్పటికీ చేయను: కార్తీ)

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)