Breaking News

త్వరలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతోన్న సచిన్‌ కూతురు సారా!

Published on Mon, 04/25/2022 - 21:25

Sachin Tendulkar Daughter Sara Bollywood Debut Soon: క్రికెట్ దిగ్గ‌జం, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండ్యూల్క‌ర్ ముద్దుల తనయ సారా త్వరలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సెల‌బ్రిటీ కిడ్ అయిన సారాకు సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్ట్రాగామ్‌లో ఆమెకు 1.8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. వెండితెర ఎంట్రీకి ముందే ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న సారా ఇప్పటికే పలు బ్రాండ్‌లను ఎండార్స్‌ చేస్తూ మరింత పాపులర్‌ అయ్యింది. ఈ క్రమంలో త్వరలోనే ఆమె ఆమె బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త బి-టౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ తాజా బజ్‌ ప్రకారం బెసిగ్గా నటనపై ఆసక్తి ఉన్న సారా ఇప్పటికే మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది.

చదవండి: పోలీసులు ఘోరంగా అవమానించారు: ‘స్కామ్‌ 1992’ నటుడు ఆవేదన

ఈ క్రమంలో ఆమె బాలీవుడ్‌ డెబ్యూ మూవీపై కొంతకాలంగా చర్చ నడుస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె త్వరలోనే ఓ మూవీలో బాలీవుడ్‌ సిల్వర్‌ స్క్రిన్‌పై సందడి చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇందుకోసం ఆమె పలు బ్రాండ్‌లకు ఎండార్స్‌ చేస్తూ నటనలో శిక్షణ కూడా తీసుకుంటుందని బి-టౌన్‌ మీడియాలు తమ క‌థనంలో రాసుకొస్తున్నాయి. కాగా లండ‌న్‌ యూనివ‌ర్సిటీ కాలేజీలో మెడిసిన్‌ పూర్తి చేసిన సారా ఇప్ప‌టికే సోషల్‌ మీడియా వేదికగా ఓ అంత‌ర్జాతీయ క్లాతింగ్ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తోంది. అంతేకాదు ఇటీవల మోడ‌లింగ్‌లోకి అడుగుపెట్టి..సొంతంగా డిజైన్ చేయించిన‌ అంత‌ర్జాతీయ క్లాతింగ్‌ను ప్ర‌మోట్ చేసుకుంటోంది. సారా క్లాతింగ్ బ్రాండ్స్ ఈ-కామ‌ర్స్ ప్లాట్ ఫాం అజియో లక్స్‌లో(Ajio Luxe) అందుబాటులో ఉన్నాయి. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)