Breaking News

రీల్స్‌ పేరుతో ఇలాంటి ఫోటోలా.. రుక్మిణి వసంత్‌ ఫైర్‌

Published on Fri, 03/06/2026 - 07:04

రుక్మిణి వసంత్‌కు కోపమొచ్చింది. చూడటానికి సాఫ్ట్‌గా ఉన్నా ఈ బ్యూటీలో కట్టలు తెంచుకునే ఆవేశం కూడా ఉందన్నది తేటతెల్లమైంది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు పరిశ్రమను కన్నడ బ్యూటీ ఆకట్టుకుంది. ప్రస్తుతం టాప్‌ హీరోల సరసన వరస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకెళ్తుంది. ఇటీవల విడుదలైన ‘కాంతార-చాప్టర్‌ 1’ లోనూ యువరాణి పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నాయకిగా నటిస్తున్న ఈమె రాంగ్‌ యాంగిల్‌ ఫొటోలను తీసే ఫొటోగ్రాఫర్లపై ధ్వజం ఎత్తారు. సాధారణంగా షూటింగ్స్‌లోనే, ఇతర కార్యక్రమాలలోనో సెలబ్రిటీలు కనిపిస్తే ఫొటోగ్రాఫర్లు తన చేతి నైపుణ్యానికి పని చెబుతుంటారు. ఇక సినీ కథానాయికలను అయితే వివిధ భంగిమల్లో ఫొటోలు తీయడానికి తెగ ఉత్సాహపడతారు. 

కొందరైతే సొగసులను చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి వైరల్‌ చేస్తుంటారు. ఇలాంటి చర్యలు తప్పుకాదు. అయితే హీరోయిన్లను రాంగ్‌ యాంగిల్‌లో ఫొటోలు తీసి రీల్స్‌ పేరుతో అన్‌ పాపులర్‌ చేసే ప్రైవేట్‌ ఫొటోగ్రాఫర్లతోనే సమస్య. ఇలాంటి విషయాలపైనే నటి రుక్మిణి వసంత్‌ మండిపడ్డారు. దీని గురించి ఆమె తన ఎక్స్‌ మీడియాలో పేర్కొంటూ నటీమణులను కించపరిచే విధంగా ప్రవర్తించే ఫొటోగ్రాఫర్ల చర్యలు ఖండించదగ్గవి అన్నారు. 

ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవడానికి తాము ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. తాను వృత్తిలో భాగంగా నటించడానికి వేస్తున్నామని, అదే విధంగా ఇతర కార్యక్రమాల్లో  పాల్గొంటారన్నారు. అలాంటి సమయాల్లో తమను  రాంగ్‌ యాంగిల్‌ చిత్రీకరించే కొందరు ప్రైవేటు ఫొటోగ్రాఫర్ల చర్యలను తీవ్రంగా ఖండిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా నటీమణులను కించపరిచే వారిపై చర్యలకూ వెనుకాడబోమని నటి రుక్మిణి వసంత్‌ అన్నారు.   

Videos

ఏ దేశంలో ఎన్ని అణుబాంబులున్నాయి? మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా

పావలా శ్యామలకు బన్నీ భరోసా..!

UPSC సివిల్స్ ఫలితాలు విడుదల టాపర్స్ వీళ్లే

బ్లూ స్పేరోతో ఖమేనీపై దాడి ఇజ్రాయెల్ కీలక ప్రకటన..

భీకర యుద్ధం.. ఇరాన్ గుండెల్లో బాంబుల వర్షం

ఈనెల 11 నుంచే ప్రభుత్వ సంస్థ.. ఏకంగా రూ.6000 కోట్లు.. రెడీగా ఉండండి..

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలి

11 మంది 1100 మందితో సమానం..! YSRCP పై పవన్ షాకింగ్ వ్యాఖ్యలు

ఏపీ మండలిలో బొత్సకు స్వల్ప అస్వస్థత

పెద్ది మళ్ళీ పోస్టుపోన్..! APR 30 కాదు.. ఎప్పుడంటే..?

Photos

+5

ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు

+5

జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకలో విజయ్‌, త్రిష సందడి.. ఫోటోలు వైరల్

+5

నిజామాబాద్‌లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

టి20 ప్రపంచకప్‌లో తుది పోరుకు భారత్‌ (ఫొటోలు)

+5

భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుక.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ ప్రొద్దుటూరు పర్యటన (ఫొటోలు)