Breaking News

'నేషనల్‌ క్రష్‌' గురించి ఎక్కువగా ఆలోచించను: రుక్మిణీ వసంత్‌

Published on Sun, 10/05/2025 - 07:31

కాంతార చాప్టర్‌-1 విడుదల తర్వాత రుక్మిణీ వసంత్‌(Rukmini Vasanth) పేరు పాన్‌ ఇండియా రేంజ్‌లో ట్రెండ్‌ అవుతుంది. అందుకు ప్రధాన కారణం ఆమె అందంగా ఉండటమే కాకుండా తన నటన, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఏకంగా శాండల్‌వుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ముద్ర వేసింది. కాంతార సినిమా చూసిన వాళ్లు అందరూ ఆమెనే నేషనల్‌ క్రష్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పుష్ప సినిమా తర్వతా రష్మిక మందన్నకు దక్కిన గుర్తింపే రుక్మిణీకి దక్కుతుంది. ఆపై వీరిద్దరూ కూడా కన్నడ నుంచే రావడం విశేషం. తనను నేషనల్‌ క్రష్‌ అని పిలువడంపై రుక్మిణీ వసంత్‌ రియాక్ట్‌ అయింది.

ఇటీవల శివకార్తికేయన్‌ సరసన ‘మదరాసీ’లో మెప్పించిన రుక్మిణీ.. ‘కాంతార చాప్టర్‌-1’తో పాన్‌ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం తన చేతిలో యశ్‌ టాక్సిక్‌, ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ సినిమాలే..  ఇందులో ఆమె పాత్ర కూడా బలంగా ఉండబోతుందని తెలుస్తోంది.

నేషనల్‌ క్రష్‌ గురించి
నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌లైన్‌ గురించి రుక్మిణీ ఇలా చెప్పింది. 'కొద్దిరోజుల నుంచి చాలా మంది నేషనల్‌ క్రష్‌ అంటూన్నారు. ఈ విషయం నా వరకు కూడా వచ్చింది. ఇలాంటివి వినడానికి మాత్రమే చాలా బాగుంటాయి. సంతోషాన్ని కూడా ఇస్తాయి. కానీ, ఇలాంటి ప్రశంసల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. ఇలాంటివి ఏమైనా సరే తాత్కాలికంగానే ఉంటాయి. కాలంతో పాటు ఎందరో వస్తుంటారు.. అవి కూడా మారిపోతుంటాయని నేను నమ్ముతాను. కానీ, ప్రేక్షకులకు దగ్గరగా ఉంటే చాలనుకుంటాను. ‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో చాలామంది నన్ను ప్రియ పాత్రతో పిలుస్తుంటారు. ఇలా ప్రేక్షకులకు చేరువయ్యితే చాలనుకుంటాను. చాలా సింప్లిసిటీతో కూడిన ఆ పాత్రను కూడా సినీప్రియులు ఆదరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.'అని ఆమె అన్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి