Breaking News

అమెరికాలో రామ్ చరణ్.. ఒక్కో సూట్ ధర అన్ని లక్షలా?

Published on Thu, 03/02/2023 - 19:42

మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ మూవీతో అంతర్జాతీయంగా ఫేమ్ సంపాదించాడు. అంతేకాకుండా ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ సైతం ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో చెర్రీ సందడి చేశారు.  ఆర్ఆర్ఆర్ హీరో అమెరికన్‌ పాపులర్‌ టాక్‌ షోలో పాల్గొనడం పట్ల మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలో అత్యంత ప్రేక్షకుల ఆదరణ పొందిన టీవీ షోలలో  ’గుడ్ మార్నింగ్ అమెరికా’ ఒకటి. టాలీవుడ్‌ నుంచి పాల్గొన్న తొలి హీరోగా రామ్‌ చరణ్‌ రికార్డుకెక్కారు

ఇటీవల రామ్ చరణ్ అమెరికాలో ఉంటూ పలు అవార్డుల కార్యక్రమాల్లో బిజీగా పాల్గొన్నారు. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి అంతర్జాతీయ వేదికలపై మెరిశారు.   అయితే తాజాగా అమెరికా పర్యటనలో చెర్రీ ధరించిన సూట్స్‌పై నెట్టింట చర్చ మొదలైంది. చెర్రీ ధరించిన షూట్స్ ఎక్కడ తయారు చేశారు? వాటి డిజైనర్ ఎవరు? వాటి ధర ఎంత? అన్న విషయాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. 

తాజా అప్ డేట్ ప్రకారం రామ్ చరణ్ వేసుకున్న సూట్స్ చెన్నైకి చెందిన ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రత్యేకంగా రూపొందించినట్లు సమాచారం. మెగా హీరో ధరించిన ఒక్కో సూట్ కోసం దాదాపు రూ.13 నుంచి రూ.70 లక్షల వరకు వెచ్చించారని తెలుస్తోంది.  అంతర్జాతీయ వేదికలపై రామ్ చరణ్ ధరించిన సూట్స్ రాయల్ లుక్‌లో కనిపించాయి. అమెరికాలో చెర్రీ రాయల్‌గా కనిపించడంపై మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)