Breaking News

ఇట్లు మీ ఎదవ.. టైటిల్‌ నేనే ఇచ్చా: ఆర్పీ పట్నాయక్‌

Published on Sat, 11/01/2025 - 10:49

‘‘బాపుగారి సినిమాకి పని చేసే అవకాశం నాకు లేకుండా పోయింది. ‘ఇట్లు మీ ఎదవ’ కథ విన్నాక... ఈ సినిమాకి పని చేస్తే బాపుగారి చిత్రం మిస్‌ అయ్యాననే లోటు తీరుతుందనే అనుభూతి కలిగింది. ఈ చిత్రానికి టైటిల్‌ సూచించింది నేనే. కథ విన్నప్పుడే హిట్‌ వైబ్‌ వచ్చింది. ఈ మూవీ చూసిన తర్వాత ఇంతకంటే మంచి టైటిల్‌ మరొకటి లేదనిపించింది. యువత తమ తల్లిదండ్రులతో కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది’’ అని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ తెలిపారు.

త్రినాథ్‌ కఠారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. సాహితీ ఆవంచ హీరోయిన్‌గా నటించారు. సంజీవని ప్రొడక్షన్స్‌పై బళ్లారి శంకర్‌ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో, దర్శకుడు త్రినాథ్‌ కఠారి మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి కథే హీరో. ఇది ఒక తండ్రీ కొడుకుల కథ, తండ్రీ కూతుళ్ల కథ, ఒక అమ్మాయి, అబ్బాయి కథ. ఈ సినిమా 100 శాతం ప్రేక్షకులను నవ్విస్తుంది’’ అని చెప్పారు. ‘‘నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. అందరూ సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు బళ్లారి శంకర్‌. కెమెరామేన్‌ జగదీష్, డైరెక్టర్‌ తేజ మార్ని, నటీనటులు మధుమణి, రిషి, గోపరాజు రమణ, దేవీప్రసాద్, తాగుబోతు రమేశ్‌ తదితరులు మాట్లాడారు.

 

చదవండి: శ్రీజ ఎలిమినేట్‌, కొత్త కెప్టెన్‌గా దివ్య.. గోడమీద పిల్లిలా భరణి!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)