Breaking News

Romanchakam: రోమాంచకం మూవీ రివ్యూ

Published on Thu, 09/03/2026 - 06:36

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన చిత్రం ‘రోమాంచకం’. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించారు. ఈ మూవీని వేణు గోపాల్ రెడ్డి తెరకెక్కించారు. సెప్టెంబర్ 3న ఈ మూవీని విడుదల చేశారు. మరి ఈ సినిమాకి సంబంధించిన కథ ఎలా ఉంది? రివ్యూ ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం. 



కథ ఏంటంటే?
అన్వేష్ (సుమంత్ ప్రభాస్) అనే ఓ కుర్రాడు బాధ్యత లేకుండా స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడు. అప్పులు చేసి స్టార్టప్ అని డబ్బులన్నీ వృథా చేస్తాడు. ‘రోమాంచకం’ అని అమ్మాయిల్ని, అబ్బాయిల్ని కలిపే ఓ డేటింగ్ యాప్ క్రియేట్ చేయాలని చూస్తుంటాడు. అయితే టెస్టింగ్ క్రమంలో ఈ యాప్ ద్వారానే చెన్నైలో ఉండే మైథిలి (అనంతిక)తో పరిచయం పెంచుకుంటాడు. ఆమె కూడా అన్వేష్ ప్రేమలో పడిపోతుంది. మైథిలీ బర్త్ డే సందర్భంగా అన్వేష్ చెన్నైకి వెళ్లి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటాడు. అలా అన్వేష్ చెన్నైకి కూడా వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అన్వేష్ ఫోన్ పోగొట్టుకుంటాడు. ఎలాగోలా మైథిలీకి ఫోన్ చేసి హోటల్‌కి రమ్మంటాడు. వస్తాను అని మైథిలీ చెబుతుంది. కానీ ఆ తర్వాత క్షణం నుంచి మైథిలీ ఫోన్ కలవదు. అన్వేష్ నంబర్‌ని అన్ని చోట్లా బ్లాక్ చేస్తుంది. మళ్లీ మూడు నెలల తర్వాత లైన్‌లోకి వస్తుంది. అసలు మైథిలీ ఎందుకు బ్లాక్ చేస్తుంది? మళ్లీ ఎందుకు లైన్‌లోకి వస్తుంది? అన్వేష్ కోసం ఆమె హైదరాబాద్‌కి ఎందుకు వస్తుంది? వచ్చాక ఏం జరుగుతుంది? ఆమె రాకతో అన్వేష్, అతని ఫ్రెండ్స్ ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారు? అన్నది మిగతా కథ. 

ఎలా ఉందంటే
జెన్ జీ మైండ్‌ సెట్‌ను బేస్ చేసుకుని కథను అల్లుకున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే కథలో చాలా వరకు లాజిక్స్, ఎమోషన్స్ ఇలా ఏవీ కనిపించవు. ఇప్పుడు ఉన్న తరం కూడా ఇలానే ఆలోచిస్తుంటుంది. ఎందుకు అలా చేస్తున్నారు.. ఇలా ప్రవర్తిస్తుంటారు? అన్నది చెప్పడం కష్టం. ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ల పాత్రల్ని చూస్తే కూడా అలానే అనిపిస్తుంది. చాలా వరకు సిల్లీగా అనిపిస్తుంది. మరీ ఇలా ఉన్నారేంట్రా.. అని అనిపించొచ్చు. కథలో ఎక్కడా కూడా ఎమోషన్ అన్నది కనిపించదు. లాజిక్ అయితే భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. 

ఫస్ట్ హాఫ్ అంతా సరదా సరదాగా సాగుతుంది. హీరో, అతని గ్యాంగ్ చేసే కామెడీ బాగుంటుంది. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ కాస్త ఫ్రెష్‌గానే అనిపిస్తుంది. పాటలు, కామెడీ సీన్లతో ఫస్ట్ హాఫ్ అంతా అలా ఫ్లోలో సాగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఫుల్ ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో అయినా కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్తుందని అనుకుంటే.. పొరబాటే. అసలు సినిమాలో ఎక్కడా కూడా సీరియస్ నెస్ కనిపించదు. చాలా వరకు ఎమోషన్ మిస్ అవ్వడం మైనస్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ కూడా ఫుల్ కామెడీగానే సాగుతుంది. లాజిక్స్, కథ గురించి ఆలోచించకుండా సరదాగా నవ్వుకోవడానికి వెళ్తే మాత్రం ఈ సినిమా కొంత వరకు ఎంటర్టైన్ చేస్తుంది. 

ఎవరెలా నటించారంటే?
సుమంత్ ప్రభాస్ యాక్టింగ్, కనిపించే తీరు అంతా కూడా పక్కింటి అబ్బాయిలా ఉంటుంది. అనంతిక మాత్రం తెరపై అందంగా కనిపిస్తుంది. ఆమె పాత్ర నిడివి కూడా చాలా తక్కువే. అయినా కనిపించినంత వరకు ఆకట్టుకుంటుంది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ మాత్రం తమ కామెడీతో ప్రేక్షకుల్ని నవ్విస్తారు. పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా నవ్విస్తుంది. మిగిలిన కారెక్టర్స్ అందరూ కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు. 

సాంకేతికంగా ఎలా ఉందంటే..
విజువల్స్ సహజంగా అనిపిస్తాయి. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గానే కనిపిస్తుంది. పాటలు బాగుంటాయి. నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. ఎడిటింగ్ బాగుంటుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉంటాయి. కథకు కావాల్సినంత ఖర్చు పెట్టినట్టుగా కనినిపిస్తుంది. జెన్ జీ ఆడియెన్స్‌ని టార్గెట్ చేసిన ఈ మూవీ కమర్షియల్‌గా ఏ రేంజ్ సక్సెస్‌ని సాధిస్తుందో చూడాలి.
 

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)