Breaking News

రోహిత్ 'సైకో' ప్రవర్తన.. నాగ్ ఎందుకు మాట్లాడలేదు?

Published on Sun, 11/01/2026 - 13:41

తెలుగు బిగ్‌బాస్ షో మీద ఎన్ని విమర్శలు వచ్చాయో లెక్కలేదు. అయినా సరే నిర్వహకులు తీరు మార్చుకోవట్లేదు. టీఆర్పీ కోసం రోజురోజుకీ తమ స్థాయి దిగజార్చుకుంటూనే ఉన్నారు. శనివారం ఎపిసోడ్‌లోనూ అలాంటి ఓ సంఘటన కంపరం పుట్టించింది. ప్రధాన సూత్రధారి రోహిత్ కాగా అతడికి వంతపాడుతూ వర్షిణి, ముకేశ్ అలానే ప్రవర్తించారు. ఇదంతా చూసి కూడా హోస్ట్ నాగార్జున ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? అసలు జనాలకు వీళ్లు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావ్.. ఎమోషనల్ ఎలిమినేషన్)

ప్రస్తుత బిగ్‌బాస్ సీజన్‌లో ప్రారంభం నుంచి త్రిగుణ్ vs రోహిత్ అన్నట్లుగానే ఉంది. రోహిత్ ఎన్ని మాటలు అంటున్నా, ఇబ్బందులు పెడుతున్నా త్రిగుణ్ గేమ్స్‌లో గెలుస్తూ వస్తున్నాడు. ఈ వారం అల్టిమేట్ గోట్ కూడా అయిపోయాడు. అదే టైంలో రోహిత్ మాత్రం సోషల్ మీడియాలోనే ఎలివేషన్లు ఇప్పించుకుంటున్నాడు తప్పితే షోలో ఘోరాతిఘోరంగా ఆడుతున్నాడు. అంతకు మించి సైకోలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు.

బిగ్‌బాస్ అనేది ఓ గేమ్ షో. ఇందులో గెలిచినా ఓడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. రెండు రోజులు పోతే అందరూ ఈ షో గురించే మర్చిపోతారు. గేమ్ పరంగా ఏదైనా అనుకోవచ్చు గానీ వ్యక్తిగతంగా తిట్టడం, టార్గెట్ చేయడం సరికాదు. అగ్నిపరీక్షలో సెలెక్ట్ అయి సామాన్యుడు అనే ట్యాగ్ లైన్‌తో హౌస్‌లోకి వచ్చిన రోహిత్.. శనివారం(అక్టోబర్ 31) ఎపిసోడ్‌లో త్రిగుణ్ గురించి మాట్లాడుతూ స‌న్న‌ని ఊచకు ఆయిల్ రాసి దింపుతానని అనడం షాకింగ్. పక్కనే ఉన్న వర్షిణి మరింత అసహ్యంగా.. 'నేనేతై క‌నిపించ‌కుండా పోతుంది' అనేసింది. ముఖేశ్ అయితే 'పుష్ అండ్ పుల్' అని సైగ‌లు చేశాడు. ఈ వ్య‌వ‌హారం మొత్తం గిఫ్ట్ వీడియో రూపంలో త్రిగుణ్‌కి చూపించారు.

ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే రోహిత్-వర్షిణి-ముకేశ్ కంపరం పుట్టేంత దారుణంగా మాట్లాడితే వాళ్లని అందరిముందు తిట్టాల్సింది పోయి.. సదరు తతంగాన్ని వీడియో రూపంలో త్రిగుణ్‌కి ఎందుకు చూపించారు? అంటే సదరు మాటల్ని చూపించి పొగపెట్టి, తద్వారా వివాదాన్ని రేపి దాన్ని టీఆర్పీ చేసుకుందామని బిగ్‌బాస్ టీమ్ అనుకుంటోందా?

ఒకవేళ ఇవే మాటలు.. ఓ అమ్మాయి గురించి అని ఉంటే షో ఆగిపోయేది. ఆగాలి కూడా. కానీ ఇక్కడ బాధితుడు మగవాడు కాబట్టి.. గిఫ్ట్ వీడియో అని చూపించి ముందుకెళ్లిపోయారు. 'మగాడు కదా తట్టుకుంటాడు' అనే ఆలోచన ఎంతవరకు కరెక్ట్? మగవాళ్ల మీద హింస, లైంగిక బెదిరింపులు కూడా వేధింపులేగా!

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా)

బిగ్‌బాస్ షోని చాలామంది తమ పిల్లలతో కలిసి చూస్తుంటారు. రోహిత్ లాంటి వ్యక్తులు సైకోల్లా ప్రవర్తించి, మట్లాడే ఇలాంటి మాటల వల్ల ఫ్యామిలీ ప్రేక్షకులకు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో బిగ్‌బాస్ టీమ్ సమాధానం చెప్పాలి. ఇప్పటికే షోని బ్యాన్ చేయాలని కొందరు ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ల వాదనకు రోహిత్ చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. బిగ్‌బాస్ షోపై ఇప్పటికే నెగిటివిటీ ఉంది. ఇలాంటి మాటలు, ప్రవర్తనతో అది మరింత దిగజారిపోతోంది.

ఈ వారం ఝాన్సీతో పాటు రోహిత్ కూడా ఎలిమినేట్ అయ్యాడని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం సరైన పనే చేశారు. ఎందుకంటే త్రిగుణ్ గురించే కాదు దేబ్జానీ గురించి ఓ సందర్భంలో మాట్లాడిన రోహిత్.. ఆమె జుట్టు పట్టి లాగుతా అన్నట్లు సైగలు చేశాడు. తనతో పోటీపడే అమ్మాయిని ఈడ్చి కొట్టాలనే మాటలు.. ఇలాంటి వాటి ద్వారా నిర్వాహకులు ఏం చెబుదామనుకుంటున్నారు? మగవాడితో పోటీపడితే అమ్మాయికి దెబ్బలే సమాధానమా? 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా)

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)