Breaking News

ప్రముఖ నటుడి మరణం.. రోడ్డుపై డ్యాన్స్‌ చేసిన భార్య

Published on Sun, 09/21/2025 - 11:56

ప్రముఖ కమెడియన్‌, నటుడు రోబో శంకర్‌ (46) మృతిపై తమిళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినిమా సెట్‌లో స్పృహ తప్పి పడిపోయిన ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా గురువారం (సెప్టెంబర్‌ 18న)చికిత్స పొందుతూ మరణించాడు. రోబో శంకర్‌ (Robo Shankar) మృతి పట్ల కమల్‌ హాసన్‌, ధనుష్‌, శివకార్తికేయన్‌, ఐశ్వర్య రాజేశ్‌ సహా పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు.

అంత్యక్రియల్లో చివరిసారిగా..
రోబో శంకర్‌ మృతితో అతడి భార్య ప్రియాంక కన్నీరుమున్నీరుగా విలపించింది. శుక్రవారం నటుడి అంత్యక్రియలు జరగ్గా.. చివరిసారి భర్తకు డ్యాన్స్‌తో వీడ్కోలు పలికింది. మనసులో విస్ఫోటనం చెందుతున్న అగ్నిపర్వతం లాంటి బాధను డ్యాన్స్‌ రూపంలో వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ప్రియ ఈ బాధ నుంచి ఎలా బయటపడుతుందో? ఏంటో? అని కామెంట్లు చేస్తున్నారు.

ఎవరీ రోబో శంకర్‌?
కాగా శంకర్‌.. రోబో డ్యాన్స్‌తో ఫేమస్‌ అయ్యారు. అలా ఆయన పేరు రోబో శంకర్‌గా స్థిరపడిపోయింది. మారి, ఇరుంబు తిరై, విశ్వాసం, చక్ర, కోబ్రా, కలకలప్పు 2, పులి, యముడు 3, మిస్టర్ లోకల్ తదితర చిత్రాలతో గుర్తింపు దక్కించుకున్నారు. దాదాపు 80కి పైగా సినిమాలు చేశారు. ఈయన భార్య ప్రియాంక కూడా కన్ని మేడమ్‌ సినిమాలో నటించింది. వీరి కుమార్తె ఇంద్రజ.. విజయ్‌ 'బిగిల్‌' (తెలుగులో విజిల్‌) మూవీలో గుండమ్మగా నటించింది.

 

చదవండి: మా అధ్యక్షుడి అక్కకే ఇలాంటి గతి.. అయినా స్పందించవా?: హేమ

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)