Breaking News

పహల్గాంలోనే ఉన్నా.. పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే: ఆర్జే కాజల్‌

Published on Wed, 04/23/2025 - 14:15

పహల్గాం: అందమైన మైదానాలు, మంచు కొండలు, పైన్‌ అడవులు.. ఎండాకాలంలో కాస్త సేద తీరుదామని జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam)కు వెళ్లిన పర్యాటకులెందరో.. ! ఈ ఆనందాన్ని చెల్లాచెదురు చేశారు ఉగ్రవాదులు. దేశంలో అలజడి సృష్టించేందుకు పర్యాటకులపై పంజా విసిరారు. భారీ ఆయుధాలతో అమాయక జనంపై విరుచుకుపడ్డారు.

ఉగ్రదాడి
ఉగ్రదాడి అని అర్థమైన పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు తీశారు. కానీ మైదాన ప్రాంతం కావడంతో తలదాచుకునే వీలు కూడా లేకుండా పోయింది. ఈ దాడిలో 26 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి నుంచి ప్రముఖ హిందీ బుల్లితెర జంట దీపికా కక్కర్‌- షోయబ్‌ ఇబ్రహీం తృటిలో తప్పించుకున్నారు. తెలుగు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, నటి ఆర్జే కాజల్‌ (RJ Kajal) సైతం కశ్మీర్‌ పర్యటనలో ఉండటంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

వీడియో షేర్‌ చేసిన కాజల్‌
ఈ క్రమంలో కాజల్‌ తను క్షేమంగా ఉన్నట్లు వీడియో షేర్‌ చేసింది. ప్రస్తుతం నేను పహల్గామ్‌ నుంచి శ్రీనగర్‌ వెళ్తున్నాను. నేను క్షేమంగా ఉన్నాను. రోడ్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రజల రక్షణ కోసం స్థానిక పోలీసులు అలుపెరగకుండా కృషి చేస్తున్నారు. నాకోసం ఆరా తీసిన అందరికీ కృతజ్ఞతలు అని వీడియో షేర్‌ చేసింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఎంతగానో బాధించిందని పేర్కొంటూ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది.

 

 

చదవండి: పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్‌ ఫైర్‌!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు