Breaking News

అల్లు అర్జున్‌ అంటే క్రష్.. నాకు భర్త అవ్వాలంటే..: రితికా నాయక్‌

Published on Tue, 10/27/2026 - 15:07

తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది యువ కథానాయిక రితికా నాయక్‌. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’,  ‘మిరాయ్‌’ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. నేడు పుట్టినరోజు నిర్వహించుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో తనకు నచ్చిన హీరో ఎవరో చెప్పిన రితికా.. తనను పెళ్లి చేసుకునే వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా వెల్లడించింది. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. 

(ఇదీ చదవండి: ఓటీటీలో సీఎం విజయ్‌ కొడుకు సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?)
అందంగా ఉంటే సరిపోదు..
సినిమా రంగంలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవాలంటే అందం ఒక్కటే సరిపోదు. నటనతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలి. ఇదే ఆలోచనతో ముందుకు సాగుతోంది రితికా నాయక్. తనకు అందమైన రూపం ఉందని మాత్రమే కాకుండా.. ‘బాగా నటిస్తుంది’ అని ప్రేక్షకులు అనుకోవాలన్నదే తన లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఉందని, ఒక్క తరహా పాత్రలకే పరిమితం కావడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది.



అల్లు అర్జున్‌ అంటే క్రష్‌..
మీ క్రష్‌ ఎవరని రితికాను ఓ సందర్భంలో అడగ్గా.. తనకు అల్లు అర్జున్‌పై క్రష్‌ ఉందని రితికా నాయక్‌ చెప్పుకొచ్చింది.  అదే సందర్భంలో జీవిత భాగస్వామి విషయంలోనూ ఆమెకు కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయని తెలిపింది. తనను ఎంతో ప్రేమించే వ్యక్తి కావాలని, బంధంలో నమ్మకానికి ప్రాధాన్యమివ్వాలని తెలిపింది.  అంతేకాదు.. తన వృత్తిని అర్థం చేసుకుంటూ, కెరీర్‌లో ముందుకు సాగేందుకు ప్రోత్సహించే వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది.   కాగా ఇటీవల కొరియన్‌ కనకరాజుతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రితికా.. వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌తో కలిసి ‘డ్యూయెట్‌’ అనే సినిమాలో నటిస్తోంది.
(ఇదీ చదవండి: వెన్నుపోటు పొడిచిన త్రిగుణ్‌.. ‘నేను చూసింది నిజమేనా’: వర్షిణి)

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)