Breaking News

రాజా శివాజీ ట్రైలర్ రిలీజ్.. జెనీలియా దంపతుల కన్నీళ్లు..!

Published on Mon, 04/20/2026 - 18:53

బొమ్మరిల్లు మూవీతో టాలీవుడ్ ప్రియుల మనసు దోచుకున్న బ్యూటీ జెనీలియా. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ అక్కడే సెటిలైపోయింది. బాలీవుడ్ రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం ముంబయిలోనే ఉన్న జెనీలియా.. గతేడాది సితారే జమీన్ పర్, జూనియర్ చిత్రాల్లో మెరిసింది.

జెనీలియా సంగతి పక్కన పెడితే ఆమె భర్త రితేశ్ దేశ్‌ముఖ్ చారిత్రక మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజా శివాజీ పేరుతో వస్తోన్న చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ముంబయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రితేశ్ దేశ్‌ముఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాకుండా రితేశ్ తన తండ్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ను గుర్తుచేసుకున్నారు. ఇది చూసి పక్కనే ఉన్న జెనీలియా సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. వేదికపైనే చిన్న పిల్లలా ఏడ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా కన్నీళ్లు..

చాలా రోజుల నిరీక్షణ తర్వాత 'రాజా శివాజీ' ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సందర్భంగా తన కల సాకారం చేసుకోవడంలో సాయపడిన చిత్ర బృందానికి రితేశ్ ధన్యవాదాలు తెలిపారు. వేదికపై రితేశ్ ఎమోషనల్ కావడంతో.. జెనీలియా దేశ్‌ముఖ్  భావోద్వేగానికి గురైంది. ఈ మాటలు విన్న సంజయ్ దత్ సైతం ఎమోషనల్‌గా కనిపించారు. ఈ కథను తీసుకురావడంలో తనకు మద్దతుగా నిలిచిన జెనీలియాకు సైతం రితేశ్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, మహేష్ మంజ్రేకర్, భాగ్యశ్రీ లాంటి స్టార్స్ హాజరయ్యారు. వీరంతా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. 'రాజా శివాజీ' చిత్రంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటించారు, ఆయన జీవ మహాల అనే పాత్రను పోషించారు. ఈ మూవీలో  సచిన్ ఖేడేకర్, ఫర్దీన్ ఖాన్, జితేంద్ర జోషి, అమోల్ గుప్తే కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా మరాఠీ, హిందీ భాషల్లో ఓకేసారి తెరకెక్కించారు. ఈ హిస్టారికల్ మూవీ మే 1, 2026న థియేటర్లలో విడుదల కానుంది. 
 

 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)