Breaking News

కాంతారపై రణ్‌వీర్ సింగ్ కామెంట్స్.. రిషబ్ శెట్టి రియాక్షన్‌..!

Published on Mon, 12/15/2025 - 22:18

కాంతార వివాదంపై హీరో రిషబ్ శెట్టి స్పందించారు. రణ్‌వీర్ సింగ్ చేసిన కామెంట్స్‌ తనకు అసౌకర్యంగా అనిపించాయని అన్నారు. చెన్నైలో జరిగిన బిహైండ్‌వుడ్స్ కార్యక్రమంలో పాల్గొన్న రిషబ్ ఈ వివాదంపై మాట్లాడారు. ప్రతిష్టాత్మక వేదికలపై దేవతలను ప్రస్తావిస్తూ మిమిక్రీ చేయకూడదని సూచించారు. కాంతార లాంటి సినిమా తీసేటప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు గౌరవప్రదంగా చిత్రీకరించామని తెలిపారు.

రిషబ్ మాట్లాడుతూ, 'కాంతార లాంటి సినిమా తీసేటప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు పాప్ కల్చర్‌గా మారిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఒక చిత్రనిర్మాతగా నేను ప్రతిదీ గౌరవప్రదంగా చిత్రీకరించాలి. వాటిని నిర్ధారించుకోవడానికి  చాలా మంది పెద్దల మార్గదర్శకత్వం తీసుకున్నా. దేవతలపై మిమిక్రీ చేయడం నాకు కూడా అసౌకర్యాన్ని కలిగిస్తుంది.  సినిమాలో చాలా భాగం సినిమాటిక్, నటనకు సంబంధించింది. అయినా కూడా దైవం అనేది సున్నితమైన అంశం. ఎక్కడికి వెళ్లినా, వేదికలపై దేవతలను అపహాస్యం చేయవద్దని నేను కోరుతున్నా. ఎందుకంటే ఇది భావోద్వేగాలతో ముడిపడిన విషయం' అని అన్నారు.

కాగా.. ఈ చిత్రంలోని పంజర్లీ దేవతను ఉద్దేశించి బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ చేసిన కామెంట్స్‌ ఆడియన్స్‌ ఆగ్రహానికి దారితీసింది. గోవాలో జరిగిన ఇఫ్ఫీ వేడుకలో రణవీర్ సింగ్ పంజర్లీ దేవతను ఇమిటేట్ చేశారు. దీనిపై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో రణ్‌వీర్ సింగ్ క్షమాపణలు కోరారు. తాను కావాలని అలా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. రిషబ్ శెట్టి  నటనను హైలైట్ చేయడమే నా ఉద్దేశమని అని అన్నారు. కాగా.. ఈ ఏడాది కాంతార: చాప్టర్ 1 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

 

Videos

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు