Breaking News

ఛావాను బీట్ చేసిన కాంతార చాప్టర్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Published on Fri, 10/24/2025 - 21:24

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. దసరా కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను దాటేసింది.

కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లు సాధించిన రెండో డబ్బింగ్ చిత్రంగా నిలిచింది. కేజీఎఫ్‌-2 తర్వాత ఈ రికార్డ్‌ సాధించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ.818 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా (రూ.807 కోట్లు) రికార్డ్‌ను అధిగమించింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 2025లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా కాంతార చాప్టర్-1 నిలిచిందన్నారు. తమిళనాడులోనూ 3వ అత్యధిక వసూళ్లు రాబట్టిన డబ్బింగ్ చిత్రంగా ఘనత సొంతం చేసుకుంది.

ఇంగ్లీష్‌లోనూ కాంతార చాప్టర్-1

ఈ ప్రీక్వెల్‌కు వస్తున్న ఆదరణ చూసి మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీని ఇంగ్లీష్‌లోకి డబ్‌ చేసి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వర్షన్‌ అక్టోబర్ 31 విడుదల చేస్తామని పోస్టర్‌ పంచుకున్నారు. ఈ మూవీ రన్‌టైమ్ రెండు గంటల 14 నిమిషాల 45 సెకన్లుగా ఉంటుందని వెల్లడించారు. ఇండియన్ భాషల్లో రిలీజైన ఒరిజినల్‌ రన్‌టైమ్ రెండు గంటల 49 నిమిషాలు కాగా.. ఆంగ్ల వర్షన్‌లో ఏకంగా 35 నిమిషాలకు తగ్గించారు. ఇప్పటికే పలు రికార్డ్‌లు సాధించిన ఈ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇంగ్లీష్‌లోకి డబ్ చేసిన తొలి ఇండియన్ చిత్రంగా కాంతార చాప్టర్-1 నిలవనుంది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు.

 

 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)