Breaking News

'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో

Published on Sun, 06/15/2025 - 16:04

'కాంతార' సినిమా సూపర్ హిట్. వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ప్రీక్వెల్ తీయడం మొదలుపెట్టారు. అప్పటినుంచి ఏం శాపం వెంటాడుతుందో ఏమో గానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. షూటింగ్‌కి వచ్చిన పలువురు నటులు చనిపోతున్నారు. ఇప్పుడు కూడా బోటు ప్రమాదం జరిగింది. ఆ టైంలో బోటులో హీరోతో పాటు ఏకంగా 30 మంది వరకు ఉన్నారు. కానీ కొద్దిలో భారీ ప్రమాదం నుంచి అందరూ తప్పించుకున్నారు. దీంతో టీమ్ అంతా ఊపిరి పీల్చుకుంది.

(ఇదీ చదవండి: మోహన్ బాబు 'పెద్ద' కోరిక.. మోహన్ లాల్ ఫన్నీ కౌంటర్)

కన్నడ హీరో రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ 'కాంతార 1'. గతంలో వచ్చిన చిత్రానికి ఇది ముందు భాగం అనమాట. ఈ ఏడాది అక్టోబరు 2న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లే చాన్నాళ్ల నుంచి షూటింగ్ చేస్తున్నారు. కానీ ఇదివరకే ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులు మరణించారు. తొలుత రాకేష్ పూజారి అనే కన్నడ నటుడు సెట్‪‌లో గుండెపోటుతో మరణించాడు. తర్వాత కొన్నాళ్లకు జూనియర్ ఆర్టిస్ట్ కపిల్.. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని సౌపర్ణిక నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. కొన్నిరోజుల క్రితం కళాభవన్ అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.

కర్ణాటకలోని మాణి జలాశయంలో శనివారం రాత్రి షూటింగ్ జరుగుతుండగా బోటు నీటిలో మునిగింది. ప్రమాద సమయంలో హీరో రిషభ్ శెట్టి సహా 30 మంది నటీనటులు, సిబ్బంది అందులో ఉన్నారు. అయితే సంఘటన జరిగిన తర్వాత వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ షూటింగ్ సామాగ్రి మాత్రం నీటిపాలైంది. అయితే చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి ఇలా వరస ప్రమాదాలు జరుగుతుండటంతో సినిమాకు ఏమైనా శాపం పట్టుకుందా అని నెటిజన్లు, అభిమానులు మాట్లాడుకుంటున్నారు. షూటింగ్ పూర్తయ్యేలోపు ఇంకెన్ని జరుగుతాయో ఏంటోనని అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ)

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)