కాంతార మరో రికార్డ్.. ఏకంగా రాజమౌళి బాహుబలినే!

Published on Tue, 10/14/2025 - 15:48

రిషబ్ శెట్టి డైరెక్షన్‌లో వచ్చిన కాంతార చాప్టర్-1 (Kantara Chapter 1) బాక్సాఫీస్ వద్ద తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా తాజాగా మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కూలీ, జైలర్, లియో కలెక్షన్స్ రికార్డ్స్‌ తుడిచిపెట్టేసిన ఈ మూవీ టాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ బాహుబలి ది బిగినింగ్‌ ఆల్‌టైమ్ వసూళ్లను దాటేసింది. కేవలం 12 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.675 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రూ.700 కోట్ల మార్క్‌ను చేరుకోనుంది.

ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో రెండోస్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో ఛావా(రూ.808 కోట్లు) మొదటిస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ చిత్రానికి రూ.451.90 కోట్ల నికర వసూళ్లు రాగా..రూ.542 కోట్ల గ్రాస్ సంపాదించింది. ఉత్తర అమెరికాలో కాంతారా చాప్టర్ -1.. పదకొండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఇండియాలో ‍అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్‌లో 17వ స్థానంలో కొనసాగుతోంది. తాజా వసూళ్లతో సల్మాన్ ఖాన్ సుల్తాన్ (రూ.628 కోట్లు), రాజమౌళి బాహుబలి (రూ.650 కోట్లు)ని అధిగమించింది. ఈ రెండు చిత్రాల కంటే తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా అరుదైన ఫీట్‌ను సాధించడం విశేషం.

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.హోంబల్ ఫిల్స్మ్‌ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు.

Videos

జోగి రమేషే ఎందుకు? అనలిస్ట్ పాషా సంచలన నిజాలు

బెడిసికొట్టిన ప్లాన్.. అడ్డంగా దొరికిన తర్వాత రూట్ మార్చిన టీడీపీ పెద్దలు

TDPకి ఓటువేయొద్దు.. నాశనమైపోతారు

సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం

బాబు, పోలీసులపై కోర్టు సీరియస్

Big Question: బెడిసి కొట్టిన పిట్టకథ..

పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మద్యం దుకాణాలు నడుపుతున్నారు: వైఎస్ జగన్

టీడీపీ జనార్దన్ రావు వీడియోపై కేతిరెడ్డి సంచలన నిజాలు..

పవన్ ప్రశ్నలు బాబు కవరింగ్

నీ వల్ల రాష్ట్రానికి ఒక్క ఉపయోగం లేదు బాబుని ఏకిపారేసిన రాచమల్లు..

Photos

+5

‘తెలుసు కదా’ సినిమా ప్రెస్‌ మీట్‌లో సిద్ధు జొన్నలగడ్డ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ శారీ లుక్‌లో ‘కూలి​’ బ్యూటీ..

+5

సారా టెండుల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్‌ ట్రిప్‌లో 'కాంతార' బ్యూటీ (ఫొటోలు)

+5

కాంతార ‘కనకావతి’ శారీ లుక్‌ అదరహో! (ఫొటోలు)

+5

'థామ' ప్రమోషన్స్‌లో రష్మిక, మలైకా అరోరా స్టెప్పులు (ఫోటోలు)

+5

చాలారోజుల తర్వాత 'విష్ణు ప్రియ' గ్లామ్‌ షూట్‌ (ఫోటోలు)

+5

‘మిత్రమండలి’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)