Breaking News

క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీలో రుద్ర‌తాండ‌వం హీరో

Published on Fri, 11/03/2023 - 15:24

ద్రౌపది, రుద్రతాండవం చిత్రాల ఫేమ్‌ నటుడు రిచర్డ్‌ రిషి, పున్నగై పూ గీత, యషికా ఆనంద్‌ హీరో హీరోయిన్‌లుగా నటించిన చిత్రం సిలనొడిగళిల్‌. ఎస్కైర్‌ ప్రొడక్షన్స్‌ యూకే సంస్థతో కలిసి పున్నగై పూగీత నిర్మించిన ఈ చిత్రానికి వినయ్‌ భరద్వాజ్‌ కథ, దర్శక బాధ్యతలను నిర్వహించారు. ఐదుగురు సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ఇది సస్పెన్స్‌, క్రైమ్‌, థ్రిల్లర్‌ చిత్రంగా ఉంటుందన్నారు.

ఇందులో రిచర్డ్‌ రిషి లండన్‌లో పేరొందిన కాస్మోటిక్‌ సర్జన్‌గా నటించారన్నారు. పున్నగై పూగీత, రిచర్జ్‌ రిషి అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారన్నారు. అలాంటి సమయంలో ప్రముఖ మోడల్‌ నటి యషికా ఆనంద్‌ అతనికి పరిచయం అవుతుందన్నారు. దీంతో వారిద్దరి మధ్య వివాహేత‌ర‌ సంబంధం ఏర్పడుతుందన్నారు. ఆ తర్వాత యషికా ఆనంద్‌ హత్యకు గురవుతుందని, ఆమెను ఎవరు ఎందుకు హత్య చేశారన్నదే చిత్ర ప్రధాన అంశం అని చెప్పారు.

ఈ సినిమా పూర్తిగా కొత్తగా ఉంటుందని లండన్‌ నేపథ్యాన్ని చిత్రానికి ఎంచుకున్నట్లు చెప్పారు. ఇంతకుముందు కొన్ని చిత్రాల్లో గ్లామర్‌ పాత్రలు పోషించిన యషికా ఆనంద్‌ ఈ చిత్రంలో చాలా ప్రాధాన్యత కలిగిన పాత్రలో అద్భుతంగా నటించారని, రిచర్డ్‌ రిషి తన పాత్రకు న్యాయం చేశారని నిర్మాత తెలిపారు. సిల నొడిగళిల్‌ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వచ్చేవారం చిత్రం టీజర్‌, ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.

చ‌ద‌వండి: గాయత్రి గుప్తాకు ఏమైంది?.. ‍‍అసలా బూతులేంటి!

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)